మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే వీటిని తినాల్సిందే!

Join Our Community
follow manalokam on social media

ఎంతో మంది బరువు తగ్గాలని అనేక టిప్స్ ని ఫాలో అవుతుంటారు. అలానే డైట్ లో అనేక మార్పులు చేస్తూ ఉంటారు. మారుతున్న జీవన శైలి, శరీరానికి వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల ఊబకాయులు కనిపిస్తుండటం చూస్తూనే ఉంటాం. ప్రతి పది మంది లో నలుగురు ఊబకాయ సమస్య తో బాధ పడుతూ ఉంటారు. మొదటగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే..? టైం కి తినడం, పడుకోవడం మాత్రం చేసి తీరాలి. అలానే వ్యాయామం చేస్తే కూడా చాలదు. దానికి తగిన ఆహారాన్ని కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బ్లూ బ్రెరీ, బ్లాక్‌ బెర్రీ, స్టా బెర్రీ వంటి మిక్డ్స్‌ బెర్రీలను స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. కనుక తింటే బరువు తగ్గడానికి సహాయపడతాయి.

అలానే ఫైబర్‌, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.  రోజుకి 5 బాదంలను తినడం వల్ల డే మొత్తం ఎంతో ఎనర్జీని అందజేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. బాదం తినడం వల్ల ఆకలిని తగ్గించి బరువు పెరగకుండా చేస్తుందని వారు పేర్కొన్నారు. రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటు, కొలస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఎండిన కొబ్బరి, ద్రాక్ష, క్యారెట్లు, పాప్‌కార్న్‌లను స్నాక్స్‌ రూపం లో తీసుకుంటే కూడా మంచిదే.

సెలరీ కర్రలుగా పిలిచే ఈ కాండలలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వీటితో జ్యూస్‌ కూడా చేసుకోవచ్చు. ఈ ఫైబర్ వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. అది ఏమిటంటే ఫైబర్‌ వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. రక్తం లో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తోంది. డార్క్‌ చాక్లెట్‌ ని కూడా తినొచ్చు. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫేవనోల్స్‌ తినే కోరికను చంపుతుంది. కాబట్టి స్వీట్స్ లాంటి వాటిని తినకుండా వీటిని కనుక మీరు తింటే బరువు తగ్గొచ్చు.

TOP STORIES

ఖాతాదారులకు అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఆన్‌లైన్‌ యూపీఐ మోసాలు పట్ల అలర్ట్‌ చేసింది. ట్వీట్టర్‌...