ఏంటి..? చెక్కరతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..! 

-

సోషల్ మీడియా ద్వారా చాలామంది..ప్రెగ్నెస్సీ కిట్ లేకుండా ఇంట్లోనే టెస్ట్ చేసుకుంటున్నారు. ఎన్నో చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చెక్కరతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు అనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇది నిజం అనుకుని చాలామంది ప్రయత్నిస్తున్నారు కూడా..అసలు ఇందులో నిజమెంత..ముఖ్యంగా ఇలాంటి సెన్సిటిన్ ఇష్యూస్ లో అప్రమత్తత ఎక్కువ అవసరం..తెలిసి తెలియన మిడిమిడి జ్ఞానంతో ఏదో ఒకటి చేసుకుని..అది ఒకవేళ గర్భందాల్చినా..లేదని చూపిస్తే..మీరు తినకూడనివి తింటే..మీకే కదా నష్టం..ఏది పడితే అది చూసి..వైద్యుల సలహా లేకుండా మీరే పాటించడం కరెక్టేనా..అసలు ఈ షుగర్ టెస్ట్ ఏంటి..ఇది ఎంత వరకూ పనిచేస్తుందో చూద్దాం.!

టెస్ట్ ఎలా చేస్తున్నారంటే..

చక్కెరతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ముందుగా ఒక శుభ్రమైన గిన్నెలో కొద్దిగా చక్కెరను తీసుకోవాలట. అందులో ఉదయం మొదటి సారిగా వెళ్లే యూరిన్‌ చుక్కలు వేయాలి. కొద్దిసేపు వేచి ఉన్న తర్వాత చక్కెరలో ఏదైనా మార్పు జరిగిందా అనేది గమనించండి. మూత్రంలో hCG ఉంటే సాధారణంగా చక్కెర కరిగిపోదు. అది ప్రెగ్నెన్సీ సంకేతంగా చెబుతున్నారు.
వైద్య నిపుణులు మాత్రం ఈ టెస్ట్ ను కొట్టిపారేశారు. ఎందుకంటే మహిళ యూరిన్‌లో చక్కెర కరగకపోవడానికి చాలా కారణాలు ఉంటాయట. ఈ పరిస్థితులలో ఇలాంటి చిట్కాపై ఆధారపడటం వందశాతం తప్పేనని చెబుతున్నారు. మరోవైపు ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మీరు ప్రెగ్నెన్సీ లక్షణాలను ఎదుర్కొంటుంటే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్‌తో చెక్ చేసుకోవడమే ఉత్తమైన పని.. గర్భం ధృవీకరించబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అంతేకానీ. ఇలాంటివి చేసి ఒక నిర్ణయానికి రావడం ఏమాత్రం కరెక్టు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటి ఆధారాలు లేని చిట్కాలను గుడ్డిగా నమ్ముతుంటే..వారికి విషయం చెప్పండి. చెక్కరే కాదు..ఇంకా ఏవేవో టిప్స్ సోషల్ మీడియాలో చెప్తుంటారు.. అన్ని అందరికి ఒకటే రిజల్ట్ ఇస్తుందని లేదు.. ముఖ్యంగా వైద్యపరంగా ద్రువీకరించని వాటిని ఇంత ముఖ్యమైన విషయంలో నమ్మకపోవడమే మంచిది.
  -Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version