ఏంటి..? పంచదార అధికంగా తింటే.. ముఖం పై ముడతలు వస్తాయా..

-

ఈ రోజుల్లో 27 ఏళ్లవారికి కూడా ముడతల సమస్య ఉంటుంది. దీనికి కారణం.. మన జీవనశైలి.. ఏది పడితే అది తినడం.. బాడీకి కావాల్సిన వాటికంటే.. అనవసరమైన వాటికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం. వాతావరణ కాలుష్యం కూడా దీనికి ఒక కారణం అవుుతంది. చెక్కరను అధికంగా తినడం వల్ల ముఖం పై ముడతలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఈ విషయం మీ అందరికీ కొంచెం షాకింగ్ అనిపించవచ్చు. కానీ చెక్కర అధికంగా వాడితే.. ఇప్పటి వరకూ.. ఆరోగ్యానికి మంచిది కాదనే విన్నాం..ఇప్పుడు ఇది అందాన్ని కూడా పాడుచేస్తుందంటున్నారు.
చక్కెరను అధికంగా తీసుకునే వారిలో చర్మంపై ముడతలు ఏర్పడటానికి అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తగిన మోతాదులో చక్కెరను ఆహారంలో భాగం చేసుకోవడం అవసరమే అయినప్పటికీ చాలా మంది మోతాదుకు మించి చక్కెరను వాడతారు. మోతాదుకు మించి చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో గ్లైకేషన్‌ అనే ప్రక్రియ మొదలై చర్మం మృదుత్వాన్ని దెబ్బతినేలా చేస్తుంది. దీంతో ముడతలు పడడం జరుగుతుంది.

ఈ ఆలోచన మానుకోవాలి..

చర్మం అందంగా, మృదువుగా కనిపించడానికి తగు పరిమాణంలో కొవ్వులు అవసరం.. శరీరంలో కొవ్వులు పేరుకుంటాయన్న భయంతో చాలా మంది కొన్ని రకాల కొవ్వు ఆహారాలకు దూరంగా ఉంటారు. ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మం యవ్వనంగా ఉండేందుకు దోహదపడతాయి. చర్మానికి మేలు చేస్తాయి. అందుకే కొవ్వు పదార్థాలను అవసరమైన మేర తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. చర్మాన్ని తేమగా ఉంచేందుకు నాణ్యమైన మాయిశ్చురైజర్లను వాడుకోవటం వల్ల చర్మంపై ముడతలు రాకుండా చూసుకోవచ్చు.

సోప్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి..

అంతేకాకుండా స్నానానికి ఉపయోగించే సబ్బుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మార్కెట్లో కొత్త సబ్బులు రాగానే.. యాడ్ బాగుంది, ప్యాకింక్ అట్రాక్టింగా ఉంది. అని వచ్చినదల్లా వాడేస్తుంటారు. అయితే అవి శరీరానికి సరిపడుతున్నాయో లేదో ఏమాత్రం ఆలోచించరు. ఇలా చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో సబ్బులు స్కిన్ కు పడక.. చర్మం పొడిబారిపోయి ముడతలు ఏర్పడే అవకాశం ఉంటుంది.ప్యాచ్ టెస్ట్ చేసుకుని.. రసాయనాలు తక్కువగా ఉన్నదే వాడుకోవాలి.

ఇలా కూడా నిద్రపోకూడదు..

ఒకే దిశలో నిద్రపోవడం వల్ల ఆ వైపు ఉన్న చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. చాలామంది చెంపలను దిండుకు ఆనించి నిద్రపోతుంటారు. అలా కాకుండా తలను ఆన్చి నిద్రపోవాలి. ఎందుకంటే తలగడ వల్ల ముఖ చర్మానికి ఒత్తిడికి గురై ముడతలు పడే అవకాశం ఉంటుంది.
బ్రకోలి, టమోటాలు, డార్క్ చాక్లెట్ , పండ్లు, వంటి వాటిని తీసుకోవటం వల్ల చర్మం బాగుంటుందంటున్నారు..సౌందర్య నిపుణులు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version