ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి..? ప్లాస్టిక్ ని వాడతారా..?

-

ప్లాస్టిక్ సర్జరీ అని మనం చాలా సార్లు వింటూ ఉంటాం. ఎక్కువగా హీరో హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుంటూ ఉంటారు. అయితే ప్లాస్టిక్ సర్జరీ అన్న పదాన్ని మనం చాలా సార్లు వినే ఉంటాం. కానీ ప్లాస్టిక్ సర్జరీని ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి తెలియదు అసలు ప్లాస్టిక్ సర్జరీ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

 

ఏదైనా చిన్న లోపాలను కూడా నటులు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మారుస్తూ వుంటారు. చాలా మంది సెలెబ్రెటీలు ప్లాస్టిక్ సర్జరీ కి వెళ్లిన విషయం మనకు తెలుసు. అయితే నిజముగా ప్లాస్టిక్ సర్జరీ లో ప్లాస్టిక్ వుంటుందా..? మరి ఎందుకు దాన్ని ప్లాస్టిక్ సర్జరీ అని అంటారు అనేది చూద్దాం.

పెదవులు, బుగ్గలు ఇలా ముఖం లో పార్ట్స్ సెన్స్టివ్ గా ఉంటాయి. సర్జరీ చేసే సమయంలో ఏం చేస్తారంటే ఓ ఇంజెక్షన్ ఇస్తారు. ముఖం వరకు స్పర్శ తెలియదు. అందాన్ని పాడుచేసి భాగం పై ఇలా మార్పులు చేస్తుంటారు. ఆ భాగాన్ని తొలగించి మిగతా చర్మాన్ని కావాల్సినట్లు మౌల్డ్ చేయడం జరుగుతుంది. కానీ ప్లాస్టిక్ ని మాత్రం వాడరు. గ్రీకు భాషలో ప్లాస్టికో అంటే మౌల్డ్. కనుక ఇలా పిలుస్తూ వుంటారు. అంతే కానీ దీనిలో ప్లాస్టిక్ ని వాడరు. కానీ తెలియని వాళ్ళు ఏదో ప్లాస్టిక్ ని వాడుతున్నారని అనుకుంటూ వుంటారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version