ఇవాళ కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. కొత్త భవనంతో పాటు, త్వరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది కాంగ్రెస్ పార్టీ. ఇక నుంచి “ఏఐసిసి ప్రధాన కార్యాలయం” అడ్రస్ …9-A, కోట్ల రోడ్ కానుంది. ఇప్పటి వరకు 24, అక్బర్ రోడ్ చిరునామా తో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉండేది. ఇక ఇప్పుడు “ఏఐసిసి ప్రధాన కార్యాలయం” అడ్రస్ …9-A, కోట్ల రోడ్ కానుంది.
అధునాతన హంగులు, వసతులతో, 100 ఏళ్ళకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 6 అంతస్తులతో సొంత నూతన భవనం ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పార్టీ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ. 2009 లో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయ భవనానికి శంఖుస్థాపన చేశారు సోనియా గాంధీ. ఇక ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 400 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు ఆహ్వానం అందింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు.