తల్లిపాలు మాన్పించడానికి ఇలా చెయ్యండి.. వెంటనే మీ పిల్లలు మానేస్తారు…!

-

చంటి బిడ్డలకు తల్లిపాలు చాలా ముఖ్యం. ఏడాది వయసు వచ్చే వరకు బిడ్డకు తల్లిపాలు పడతారు. అయితే ఏడాది తర్వాత తల్లిపాలు మానిపించడానికి తల్లులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు తల్లిపాలను మానడానికి ఇష్టపడరు. కానీ తల్లులు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం వంటి కారణాల వలన పాలు ఇచ్చే తీరిక, ఓపిక ఉండదు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలకి తల్లిపాలు మాన్పించాలని అనుకుంటారు. అలా మాన్పించాలని మీరు అనుకున్నట్లయితే.. వీటిని ఫాలో అయితే సరిపోతుంది. మీరు మీ బిడ్డకు పాలు మానిపించడానికి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి మీరు బిడ్డకు పాలు ఆపేసిన కొత్తల్లో ఆమె ఏడవడం అరవడం ఇటువంటివి చేస్తూ ఉంటుంది. మీరు కరిగిపోయి మళ్లీ పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అస్సలు వాళ్ళు మానరు.

కాబట్టి మొండిగా మీరు వ్యవహరించాలి. పాలు ఆపేసినప్పుడు లేదా తగ్గించినప్పుడు పిల్లల ప్రవర్తన మారిపోతుంది. బిడ్డకు తల్లిపాలు తక్కువగా ఇవ్వాలనుకున్న మాన్పించాలనుకున్న దానికి ప్రత్యమ్నయాన్ని చూపించండి. పాల డబ్బాలు, సిప్పర్లు అలవాటు చేయాలి. రుచిగా ఉండే ఆహార పదార్థాలను వాళ్ళకి ఇవ్వండి. తల్లి పాలు ఇవ్వడాన్ని తగ్గించాలని లేదా ఆపేయాలని అనుకుంటే బాగా అల్లరి చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఓపికగా వ్యవహరించాలి. ఆకలి వేస్తే మిమ్మల్ని పాలు పెట్టమని వాళ్ళు అడుగుతారు.

ఆకలి వేయకుండా ముందే ఏదో ఒకటి తినిపిస్తూ ఉండాలి. ఇంట్లో తీసిన పండ్ల రసాలు, అన్నం, పప్పు, క్యారెట్లు ఇలాంటివి ఏమైనా సరే మీరు పెట్టొచ్చు. క్యాబేజీ ఆకుల్ని బాగా కడిగి ఫ్రిజ్లో పెట్టి చల్లగా అయ్యేలా చేయాలి. ఆకుల్ని నేరుగా రొమ్ములు మీద పెట్టుకోవాలి వాటిని అలా ఉంచి మీరు దుస్తులు వేసుకోవాలి. ఎక్కువసేపు ఇవి ఉంచడం వలన పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. కోల్డ్ థెరపీ అని కూడా దీనిని అంటారు. వెల్లుల్లి రసం, అల్లం రసం మీరు రాసుకున్నట్లయితే పిల్లలు ఆ రుచికి పాలు తాగలేరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version