ఆడవాళ్లు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మగవాళ్ళ కంటే ఆడవాళ్లు ఎక్కువ పనులు చేసుకోవడం, ఒత్తిడి ఇలా చాలా కారణాల వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఐరన్ లోపిస్తే రక్తహీనతతో పాటుగా చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాలి. వీటిని అధిగమించడానికి ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతర పోషకాలు కూడా పాలకూరలో సమృద్ధిగా ఉంటాయి.
కాయ ధాన్యాలను కూడా ఆడవాళ్లు తీసుకోవాలి. కాయధాన్యాలలో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఉంటుంది. అదే విధంగా ఐరన్ కూడా వీటిలో లభిస్తుంది. ఎర్ర మాంసంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. శరీరానికి కావలసినంత ఐరన్ పొందడానికి దీన్ని కూడా తీసుకోండి. దీనితో పాటుగా క్వినోవా, శనగలు కూడా తీసుకోవాలి.
రెండిట్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఉడికించిన శనగలు లేదా వేయించిన శనగల్ని మీరు తీసుకోవచ్చు. కోకో కంటెంట్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే గుమ్మడి గింజలను తీసుకుంటే కూడా ఐరన్ లభిస్తుంది. ఈ ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటుగా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తొలగించుకోవడానికి చూసుకోవడం, శరీరానికి సరిపడా నీళ్లు, మంచి నిద్ర తో ఆరోగ్యంగా ఉండొచ్చు.