హోంమంత్రి అనితపై మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్

-

ఏపీలో ఇటీవల వరుసగా అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య విమర్శ, ప్రతి విమర్శలు చోటుచేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే వారం కిందట ఇంటర్ విద్యార్థినిపై లైంగికదాడి, హత్య ఘటన చోటుచేసుకుంది. దీంతో మాజీ మంత్రి రోజా.. హోంమంత్రి అనితపై హాట్ కామెంట్స్ చేశారు.

‘మీ పార్టీ ఆఫీస్‌కు 10కి.మీ దూరంలోని గుంటూరు ఆస్పత్రిలో దుండగుడు నవీన్ హత్యాయత్నం చేసిన దళిత యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించలేవా? అని అడిగారు. అదేవిధంగద బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థి దస్తగిరమ్మ హత్య జరిగి 3 రోజులైంది. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలనిపించలేదా? మంత్రిగా బాధ్యతలు మరిచిన మీకు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు..రాదు’ అని మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వంలో లైంగిక దాడులు, హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version