మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే…!

-

సాధారణంగా మహిళలు అనేక సమస్యలని ఎదుర్కొంటారు. ఆహారంలో మార్పులు చేస్తే ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. అయితే మహిళలూ మీ ఆరోగ్యం మెరుగు పడాలంటే మీ డైట్ లో వీటిని చేర్చండి. అప్పుడు మీరు మరెంత ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక వివరాల లోకి వెళితే… మహిళల్లో తరచూ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఈ సమస్య నుండి బయట పడాలంటే… క్రాన్ బెర్రీస్ ఎంతగానో ఉపయోగపడతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి.

అలానే ఓట్స్ కూడా తెలుసుకోండి. వీటి వల్ల గుండెతో పాటు జీర్ణ క్రియను ఇవి మెరుగు పరుస్తాయి. ఓట్స్ ని తీసుకుంటే… బరువు అదుపులో ఉంటుంది. ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ వల్ల కలిగే భావోద్వేగాలను కూడా ఇవి నియంత్రిస్తాయి. ప్రతీ రోజు కొన్ని అవిసె గింజలు తీసుకోండి. అవిసె గింజలు గుండెకు ఎంతో మంచిది. అలానే ఇది తింటే మల బద్దకం సమస్య నుంచి బయట పడొచ్చు. వీటిలో వాపును, నొప్పిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

పాలకూర కూడా మీ డైట్ లో చేర్చండి. దీని వల్ల మహిళలకు ఎంతో అవసరం అని చెబుతున్నారు నిపుణులు. మెగ్నీషియం కలిగిన పాలకూరని తినడం వల్ల మహిళల పీఎమ్ఎస్ లక్షణాలను అడ్డుకుంటుందని. పాలకూర ఎముకల పటుత్వానికి, ఆస్తమా రాకుండా ఉండేందుకు, రక్తపోటు నియంత్రించేందుకు కూడా సహాయ పడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండడానికి టొమాటోని తీసుకోండి. టొమాటో కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news