20 దాటిన మహిళలు ఈ టెస్టులు తప్పక చేయించుకోవాలి..!

-

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యంగా ఉండడానికి ఆహార పదార్థాలు మొదలు జీవన విధానం వరకు ప్రతిదీ కూడా బాగా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే 20 దాటిన మహిళలు కొన్ని టెస్ట్లు చేయించుకుంటే హెల్తీగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. ఏమైనా సమస్య ఉంటే సరిచేసుకోవచ్చు. 20 దాటిన వాళ్ళు ఈ టెస్ట్స్ చేయించుకోవడం మంచిది. 20 దాటిన మహిళలు బీపీని చెక్  చేయించుకోవాలి. బీపీ చెక్ చేయించుకోవడం వలన గుండె సమస్యలు ఏమైనా ఉంటే కూడా తెలుసుకోవచ్చు. అలాగే హై బీపీ వలన చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఒకవేళ బీపీని కంట్రోల్ చేయలేక పోతే హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ సమస్యలు, స్ట్రోక్ ఇలా ఎన్నో వస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా చెక్ చేయించుకోవడం ముఖ్యం. కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయించుకుంటే గుండె ప్రమాదాలు ఏమీ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. 20 దాటిన వాళ్ళు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అధిక కొలెస్ట్రాల్ వలన చాలామంది కార్డియా వాస్కులర్ సమస్యలతో బాధపడుతున్నారు.

అలాగే బ్లడ్ గ్లూకోస్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవడం వలన డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. అలాగే బాడీ మాస్ ఇండెక్స్ చూసుకోవాలి. అధిక బరువు వలన అనేక ఇబ్బందులు వస్తాయి. కనుక బరువుని కూడా సరిగ్గా మెయింటైన్ చేయాలి. బరువుని కూడా చెక్ చేయించుకోవాలి ఇలా 20 దాటిన వాళ్ళు వీటిని టెస్ట్ చేయించుకుంటే హెల్తీగా ఉండొచ్చు. అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version