urination painful : నొప్పి వస్తుందని ఆ పని మానేస్తున్నారా..అయితే చాలా ప్రమాదమే..!

-

దగ్గు, జలుబు, జ్వరం ఇంకా బయటకు చెప్పుకోకలిగే జబ్బులు ఏమైనా సొంతవాళ్లతో చెప్తాం, వెంటనే వైద్యులను సంప్రదిస్తాం..కానీ చాలామంది మూత్రవిసర్జన సమయంలో నొప్పి వస్తే..లైట్ తీసుకుంటారు..ఒక్కోసారి బాత్రుమ్ కు వెళ్లటం కూడా మానేస్తుంటారు. ఏదో వేడిచేసిందనుకుని సొంత చిట్కాలు పాటిస్తారు. కానీ ఇది అన్నివేళలా మంచిది కాదు. ఈ సమస్య మహిళలలో ఉన్నట్లు అయితే..వారు డైసురియా అనే వ్యాధితో బాధపడుతున్నారని చెప్పవచ్చు. మూత్రవిసర్జన సమయంలో వచ్చే సమస్యలను డైసూరియా అంటారు.

ఈ పరిస్థితికి కారణం ఏంటి, యోని దగ్గర ఏం జరుగుతుంది అనే విషయం పై పూణేలోని మధురహెడ్ ఆసుపత్రిలో ప్రసూతి డాక్టర్, గైనకాలజిస్ట్ స్వాతి గైక్వాడ్ కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. వారు చెప్పినదాని ప్రకారం డైసూరియాను ప్రతి మనిషి ఏదో ఒకరోజు ఎదుర్కోకతప్పదు. మూత్రవిసర్జన చేసే సమయంలో భరించలేని నొప్పి రావటం మన అనారోగ్య పరిస్థితికి సంకేతం. దీనికి తక్షణమే వైద్యం చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ పరిస్థితికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉంటాయి..

1. యూరినరీ ఇన్ఫెక్షన్

మొదటిది యూరినరీ ఇన్ఫెక్షన్. ఇది మహిళలో సర్వసాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్. దీనికి ప్రధాన కారణం..బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి వచ్చి.. మూత్రాశయంలోకి ప్రవేశించినప్పుడు అది ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. దానివల్ల మంటగా అనిపిస్తుంది. దీనిని తొలిదశలోనే నిర్థారించి వైద్యుల చికిత్స తీసుకోవాలని డాక్టర్ స్వాతీ తెలిపారు.

2. లైంగిక సంక్రమణ (STI)

డైసూరియాకు మరొక కారణం.. లైంగిక సంక్రమణ..(STI).కలయిక అనంతరం.. యోని దగ్గర దురద, స్రావం కలిగితే అది డైసూరియాకు దారితీస్తుంది. ఒకవేళ యోని ప్రాంతంలో వాపు ఏర్పడినట్లైతే..దానిని సిస్టిటిస్ అంటారు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఇది ఏర్పడుతుంది. ఈ నొప్పి సిండ్రోమ్ కు దారితీస్తుంది. పైగా ఇది సంభోగం సమయంలో కూడా బాధిస్తుంది.

3. ఈస్ట్ ఇన్ఫెక్షన్

మూడవది ఈస్ట్ ఇన్ఫెక్షన్..మూత్ర విసర్జన సమయంలో మంటలా అనిపిస్తే దాన్ని ఈస్ట్ ఇన్ఫెక్షన్ గా నిర్ధారించవచ్చు. వర్జైనా ప్రాంతంలో ఈస్ట్ అధికంగా పెరగటం వల్ల ఇది ఏర్పడుతుంది. ఒకవేళ మీరు ఇది గమనించినట్లయితే మీ వైద్యులను సంప్రదించి వారి సలాహాలు తీసుకోవటం మంచిది. సొంత వైద్యాలు చేయటం ఇలాంటి వాటికి అంతగా మంచిది కాదు.. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందిని ఆమె హెచ్చరించారు.

4. సిస్టిటిస్

ఇక ఆఖరిది..సిస్టిటిస్.. మూత్రాశయం యొక్క వాపును సిస్టిటిస్ గా పిలుస్తారు. దీనికి కూడా కారణం..బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనే చెప్పవచ్చు. దీనివల్ల మూత్రవిసర్జన సమయంలో భరించలేని మంట, చిరాకు వస్తుంది. ఇతరత్రా సమస్యలు అయితే ఆలస్యం చేసినా పర్వాలేదు..కానీ వరైనాకు సంబంధించిన సమస్యల్లో ఆలస్యం చేయటం మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. సమస్యను వెంటనే గుర్తించి క్రమబద్ధీకరించుకోవాలని స్వాతీ గైక్వాడ్ తెలిపారు.

ఈ సమస్య మహిళల్లో చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. మూత్ర విసర్జన అనంతరం పొత్తికడుపు లేదా జననేంద్రియాల్లో నొప్పి లేదా మండుతున్నట్లు అనిపిస్తే…సెక్స్ సమయంలో అది ఇంకా బాధిస్తుంది. దానివల్ల ఎక్కువసేపు సంభోగంలో పాల్గొనలేరు. కాబట్టి మహిళలు ఈ లక్షణాలపై దృష్టిపెట్టి పరిస్థితి తీవ్రంకాకముందే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news