ఈ రాశి వారు ఈరోజు శుభకార్యాలకు వెళతారు..

-

జూన్ 23 న గురువారం ఈ రాశి వారు అనుకున్న పనులు నెరవేరుతాయి..ఆర్థిక లాభాలు కూడా బాగుంటాయి.

మేషం:  ముఖ్యమైన పనులకు ఆటంకాలు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి..ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ.

వృషభం: ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి..శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

మిథునం: చేపట్టిన పనులు పూర్తీ అవుతాయి.. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు..కొత్త పనులు వాయిదా.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కొన్ని నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి..ఆలోచన అవసరం.

సింహం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ మరింత పెరుగుతుంది. ప్రయాణాలలో అవాంతరాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి..కొత్త ఉద్యోగ అవకాశాలు ఫలితాలను ఇవ్వవు.నిరాశ అధికం.

కన్య: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.కొత్త రుణాలు, దూర ప్రయాణాలు అనుకూలం.

తుల: ప్రముఖులతో పరిచయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత. నూతన విద్యావకాశాలు.కుటుంబం లో సంతోషం.

వృశ్చికం: విచిత్ర సంఘటనలు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి..ఈరోజు నిదానంగా ఉండాలి. నోరు జారి ఏది అనకూడదు.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు, ఇబ్బందులు. కొన్ని పరిస్థితులు చేజారి పోతాయి..

మకరం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలలో అభివృద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కుంభం: పనుల్లో అవాంతరాలు. రుణభారాలు. మిత్రులతో కలహాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు..కొత్త ఉద్యోగ అవకాశాలు నిరాశ పరుస్తాయి..

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం..శుభకార్యాలు, విందువినోదాల లో పాల్గొంటారు..

Read more RELATED
Recommended to you

Latest news