ఈయన కొండముచ్చుల పాలిట రొట్టెల దాత!

-

కొండముచ్చులేంది అని జుట్టు పీక్కోకండి. కోతుల జాతిలోనే అవో రకం కోతులు. వాటి తోక పెద్దగా ఉంటుంది. మూతి నల్లగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వటిని కొండెంగలని కూడా అంటారు. కోతులు ఉన్న చోట కొండముచ్చులు ఉండవు. కొండముచ్చులు ఉన్న చోటు కోతులు ఉండవు. వాటికి పడదు. అందుకే అవి వేర్వేరుగా ఉంటాయి. సరే.. వాటి జాతి గురించి పక్కన బెడితే.. ఓ వ్యక్తి ఈ కొండముచ్చుల పాలిన రొట్టెల దాత అయ్యాడు. ఒక రొట్టె కాదు.. రెండు రొట్టెలు కాదు.. ఏకంగా 1700 రొట్టెలను ప్రతీ సోమవారం కొండముచ్చులకు అందిస్తున్నాడు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన స్వప్నిల్ సోని కొండముచ్చుల పాలిట దేవుడయ్యాడు. అక్కడికి సమీపంలోని అటవీ ప్రాంతంలో తిండి దొరక్క అల్లాడుతున్న కొండముచ్చులకు ఆయనే ఆహారాన్ని అందిస్తున్నాడు. గత పదేళ్ల నుంచి ఆయన ఇలా కోతులకు రొట్టెలను అందిస్తున్నాడు. మధ్యలో కొన్ని రోజులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కోతులకు రొట్టెలు ఇవ్వడం మాత్రం మానలేదట. ఇప్పుడు తను ఆర్థికంగా బాగానే ఉన్నాడట. అయినా.. త్వరలోనే అతడి కొడుకు కూడా ఈ రొట్టెల పంపిణీలో భాగస్వామ్యమవుతాడంటూ మీడియాకు వెల్లడించాడు సోని. ప్రతి సోమవారం కారులో రొట్టెలను తీసుకొని వచ్చి వాటికి తినిపించాకనే అక్కడి నుంచి వెళ్తాడట సోని.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version