ఆనందాన్ని అన్వేషిస్తున్నావా? అదెక్కడుంటుందో తెలుసుకోవాలనుందా? ఐతే ఇది చదవండి..

-

ఆనందం మనిషి హక్కు. ఈ మాట ప్రఖ్యాత తెలుగు రచయిత చలం అన్నాడు. ఈ సృష్టిలో ఏదీ కూడా తనది కాని దాన్ని పట్టుకుని వేలాడదు. ఏ జంతువైనా తీసుకోండి. దానికి కావాల్సిన దాన్ని దక్కించుకోవడానికే ప్రయత్నిస్తుంది. అది దొరకనపుడు వదిలేసి మరో దాని కోసం వెళ్తుంది. అంతేగానీ అది దొరికిదేదాకా దాని కోసమే చూస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకోవు. ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తింటాయి. మిగతా టైమ్ లో వాటి పని అవి చేసుకుంటాయి. కానీ మనిషి అలా కాదు. ఏదో ఆశించి, దాని కోసం శ్రమించి, అది దొరకలేదని బాధపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు.

ఈ మొత్తం క్రమంలో ఆనందాన్ని కోల్పోతాడు. ఉన్నదాంట్లో తృప్తి పడాలనే తపన మనిషికి ఉండదు. ముందుగా చిన్న ఇల్లు కావాలంటాడు. ఆ తర్వాత అందులోకి ఫర్నీచర్స్ అంటాడు. బయట తిరగడానికి కారు, వినోదానికి సినిమా, చూపించుకోవడానికి ఆస్తులు, గొప్పలు చెప్పుకోవడానికి పేర్లు మొదలైన వాటికోసం తపిస్తూనే ఉంటాడు. ఈ పద్దతిలో ఆనందం అనే విషయాన్ని మర్చిపోతాడు.

చాలా రోజులు దాని గురించి పెద్దగా ఆలోచించడు. కానీ కొన్ని రోజులకి అది కావాలని అనిపిస్తుంది. అప్పుడు అది దొరకదు. ఎక్కడ దొరుకుతుందనే విషయం కూడా మర్చిపోతాడు. అన్ని తాడులు కలిసి బంధంగా ఏర్పడ్డట్టు, సమస్యలన్నీ చుట్టుముట్టి ఆనందాన్ని దగ్గరకి రానీయవు. ఎంత ప్రయత్నించినా దాన్ని చేరుకోలేడు. ఇక్కడ విశేషం ఏంటంటే, సమస్యల్లో చిక్కుకున్నప్పుడు నేను కాబట్టే ఇలా ఉన్నాను, వేరే వాళ్ళయితే ఈ సమస్యల నుండి బయటపడేవారు కాదు అంటాడు. అలా అనడంలోనే సంతృప్తి పొందుతాడు తప్ప నిజమైన ఆనందం అందుకోడు.

ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆనందం నీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు ఉదయం లేచినపుడు నువ్వేమనుకుంటున్నావ్? ఈ రోజుని ఎలా గడపాలనుకుంటున్నావ్? ఏం చేస్తే ఈ రోజు మొత్తంలో ఆనందంగా ఉండగలవు అనేది ప్రశ్నించుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఈ జీవితంలో ఆనందం గురించి ఇంకెప్పుడో ఆలోచిద్దాం అనే ఆలోచన చేయవద్దు. నువ్వు జీవించే ప్రతీ క్షణాన్ని ఆనందించడమే జీవితం.

Read more RELATED
Recommended to you

Latest news