వివిధ రకాల పంటలను అందరూ పండిస్తారు..కానీ భిన్నంగా ఆలోచించి అధిక లాభాలను పొందేవాల్లు అతి తక్కువ మందే ఉంటారు..తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడులు అందించే దీర్ఘకాలిక వెదురు పంట సాగుకు శ్రీకారం చుట్టి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అనంతపురం జిల్లా, గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన పాటిల్ వంశీకృష్ణారెడ్డి. ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ చదివినా సాగు రంగంపై మక్కువతో వ్యసాయం బాట పట్టారు.వీరు సాగులోకి రాకముందు బళ్లారిలో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకునేవాడు.
కరోనా నేపథ్యంలో సొంత ఊరికి వచ్చేసారు.తన మిత్రుడి సలహాతో వెదురు వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ, ఉద్యాన అధికారుల సూచనలతో ఊరిలో తనకున్న పది ఎకరాల్లో వెదురు పంట పెట్టారు.. హోసూరులో రూ.2లక్షలతో టిష్యూకల్చర్‌తో అభివృద్ధి చేసిన బల్కోవా, న్యూటన్ రకాలకు చెందిన 10 వేల వెదురు పిలకలను రైతు వంశీకృష్ణారెడ్డి కొనుగోలు చేసి పదెకరాల్లో మొక్కకు మొక్కకు మధ్య 10 అడుగుల దూరం పాటించి నాటారు. ఎకరా సాగుకు రూ.50 వేల ఖర్చు వచ్చిందని రైతు అన్నయారు.వెదురు పెరిగే వరకు ఆదాయ వనరుగా అంతర పంటలో మునగ సాగు చేశారు. రెండో విడతలో మరో పది ఎకరాలలో టుల్డా రకం సాగు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఈ వెదురు సాగులో ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి..
పంట కాలం ఎంచుకున్న రకంపై ఆధారపడి ఉంటుంది. బల్కోవా రకం మూడున్నర సంవత్సరాల వ్యవధిలో మొదటిసారి కోతకు వస్తుంది. న్యూటన్ రకం కోతకు రావడానికి నాలుగేళ్ల సమయం పడుతుంది. వెదురుకు పంటకు వ్యాధులు గానీ, తెగుళ్లు గానీ రావు. క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.వెదురు సాగులో అటువంటి భాధలు లేవు..మొక్కలు పెద్దవైన పిదప అంతర పంటలుగా అల్లం, పసుపు పంటలు కూడా సాగుచేసుకోవచ్చు. ప్రస్తుతానికి వెదురుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.మార్కెట్ లో టన్ను ధర రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు పలుకుతోంది..మీకు ఆసక్తి ఉంటే మీరు ఈ పంటను సాగు చెయ్యండి..