పిజెఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఇంట్లో విందు సమావేశానికి హాజరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. విందు అనంతరం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. పీజేఆర్ కుమారుడు తండ్రికి తగ్గ తనయుడు అని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో మనమందరం కలిసి పనిచేయాలని సూచించారు. విష్ణువర్ధన్ రెడ్డి ని చూసి కాంగ్రెస్ యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బిజెపి, టిఆర్ఎస్ కలిసే ఉన్నాయనే కుట్రను గమనించాలన్నారు.
తెలంగాణ ప్రజల భవిష్యత్తు పట్ల కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ధరణి చట్టం వల్ల వేలాది మంది రైతులకు అన్యాయం జరుగుతుందని, వారి పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. కెసిఆర్ రాబందుల సమితి నాయకుడు అని మండిపడ్డారు మధుయాష్కి. కాంగ్రెస్ పార్టీ గిరిజనుల సమ్మేళనం సభ నిర్వహిస్తుందని, దానికి రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు.