ఆవు పేడతో వ్యాపారం..నెలకు 5 లక్షలు సంపాదిస్తున్న యువకుడు..

-

వ్యవసాయానికి ఆవులు మంచివి..ఇక ఆవు పేడతో వచ్చిన ఎరువులు చాలా సారవంతమైనవి..కేవలం వ్యవసాయానికి మాత్రమే కాదు. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ పేడ తో డబ్బులు సంపాదించవచ్చనని ప్రభుత్వం అంటుంది.అంతే కాదు..ఛత్తీస్‌గఢ్  ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. గోధన్ న్యాయ్ యోజన పేరుతో గ్రామీణ ప్రజల నుంచి పేడను కొనుగోలు చేసే పథకాన్ని తెచ్చింది. ఇప్పుడు ఈ పథకంతో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. పేడను విక్రయించి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు..

కొరియా జిల్లా మనేంద్రగఢ్ ప్రాంతానికి చెందిన శ్యామ్ కుమార్ ఆవుపేడ వ్యాపారం చేసి సక్సెస్ అయ్యాడు. మొదల్లో ఆయన పాల డెయిరీ వ్యాపారం చేసేవారు.ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎప్పుడైతే గోధన్ న్యాయ్ యోజన పథకం తీసుకొచ్చిందో అప్పటి నుంచి శ్యామ్ జీవితం మారిపోయింది. పాల వ్యాపారాన్ని పక్కనబెట్టి.. ఆవుపేడను విక్రయించడం మొదలు పెట్టారు. అలా ఇప్పటి వరకు 4 లక్షల 10 వేల రూపాయల ఆదాయం పొందాడు. ఈ మధ్యే శ్యామ్ కుమార్‌కి వివాహం జరిగింది. గత ఏడాది వరకు ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడ్డానని.. పిల్లనిచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని శ్యామ్ కుమార్ తెలిపారు.

తన వ్యాపారం అభివృద్ధి చెందడంతో అతనికి ఎన్నో సంబంధాలు వచ్చాయని పెళ్ళి కూడా అయ్యిందని చెప్పాడు.గోధన్ న్యాయ్ యోజన పథకం తర్వాత తన జీవితం మారిపోయిందని ముఖ్యమంత్రికి చెప్పి.. సంతోషం వ్యక్తం చేశారు. ఈ పథకానికి ముందుకు తాను ఎన్నో కష్టాలు పడ్డానని.. పెళ్లి చేసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని చెప్పారు. ఆవు పేడ విక్రయాల తర్వాతే.. ఆర్థికంగా నిలదొక్కుకున్నానని తెలిపారు.మొత్తానికి అతని వ్యాపారం మూడు పూవ్వులు ఆరు కాయలుగా ఉండటం తో ఆ రాష్ట్ర సీఎం కూడా అభినందించారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version