ముంబై లో జరిగిన మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలలో మిస్ టీన్ ఇండియా గా తెలుగమ్మాయికి ఎంపిక అయ్యింది. ఈ పోటీలు కేవలం భారత దేశం నుంచీ వలస వెళ్ళిన ఎన్నారైలలో ఉన్న యుక్త వయసు అమ్మాయిల మధ్య జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భారతీయులు వివిధ దేశాలలో స్థిరపడినవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, వివిధ దేశాల నుంచీ ఎంతో మంది ఈ పోటీలలో పాల్గొన్నారు.
సెప్టెంబర్ 2 న మొదలైన ఈ పోటీలు సెప్టెంబర్ 7 తో ముగిశాయి. ఈ పోటీలలో దాదాపు 39 మంది పాల్గొన్నారు. వారిలో 7 గురు ఫైనల్స్ కి వెళ్ళారు. దాదాపు ఐదు రోజుల పాటు జరిగిన ఈ పోరులో ఈషా కోడె కి ఈ అందాల కిరీటం దక్కింది. పద్మావతి సినిమాలోని ఓ పాటకి ఆమె చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. అలాగే మానసిక ధృడత్వం, ఒత్తిడి నుంచీ దూరం అవడానికి కొన్ని స్వచ్చంద సంస్థల ద్వారా దీపికా పదుకొనే చేస్తున్న కృషి తనకి ఎంతో స్పూర్తి ఇచ్చిందని ఆమె తెలిపింది.
మానసిక మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నట్టుగా ఆమె తెలిపారు. డియాట్రిక్ కార్డియా