చాటింగ్ లో Hmm… పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? అయితే మీరు సైకోనే!

-

Hmm.. అనే పదం ఉపయోగించినంత మాత్రాన సైకో అయిపోతారా భయ్యా.. అని అంటారా. అదొక్కటే కాదు.. ఇంకా ఈ లక్షణాలు మీలో ఉన్నాయంటే మాత్రం మీరు పక్కా సైకోనే. మరి మీరు సైకోనా కాదా.. అని తెలుసుకోవాలనుందా? ఇంకెందుకు ఆలస్యం.. పదండి తెలుసుకుందాం.

సైకోపాత్… అనే పదం విన్నారా ఎప్పుడైనా? సరే.. మానసిక సమస్యలు, మానసిక రుగ్మత అనే పదాలు వినే ఉంటారు కదా. వీటన్నింటికీ ఒకటే అర్థం.. ఏంటంటే.. మానసికంగా వాళ్లు ఆరోగ్యంగా లేరు అన్నమాట. మరి శారీరక సమస్యలంటే.. మన శరీరంలోని ఏదైనా అవయవానికి ఏదైనా జరిగినప్పుడు దాన్ని శారీరక అనారోగ్యం అంటాం. కాని.. మెదడుకు ఏదైనా అయితే దాన్ని మానసిక సమస్య అంటాం. ఇప్పుడు  ఓ క్లారిటీ వచ్చిందా? సరే.. అసలు విషయంలోకి వెళ్దాం.

Hmm, uh, um, huh… ఇలాంటి పదాలను ఎక్కువగా చాటింగ్ లో, బయట వాడేవారు సైకోపాత్ లు అవుతారట. అంటే.. ఇటువంటి వాళ్లు బయట ఒకలా.. లోపల మరోలా ఉంటారట. Hmm అని బయట అంటారు.. తమ లోపల ఇంకోటి మాట్లాడుతుంటారు. కాబట్టే వీళ్లు సైకోలుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చూశారుగా పైన ఫోటో. సాధారణంగా మన చేతికి ఉన్న ఉంగరం వేలు, చూపుడు వేలు రెండూ సమానంగా ఉంటాయి. ఒకవేళ ఉంగరం వేలి కన్నా చూపుడు వేలు పొడవుగా ఉంటే వాళ్లు schizophrenia  అనే సమస్యతో బాధపడతారట. దీన్ని రీసెర్చర్లు తమ పరిశోధనలో నిరూపించారు. ఈ సమస్య ఉన్నవాళ్లను, లేని వాళ్లను గ్రూపులుగా విభజించి వారి వేళ్లను పరిశీలించి ఈ విషయం తెలుసుకున్నారట. ఇంతకీ.. ఈ schizophrenia ఏంటి అనే డౌట్ వచ్చి ఉంటుంది మీకు. Schizophrenia అనేది ఓ డిజార్డర్. ఈ సమస్య ఉన్నవాళ్లు క్లారిటీగా ఆలోచించలేరు, ఫీల్ అవ్వలేరు, సరిగ్గా బిహేవ్ చేయలేరు అన్నమాట.

చూశారా వీడియో. ఏముంది ఆ వీడియోలో అంటారా? ముందు ఈ విషయం చెప్పండి. మీకు ఆ వీడియోలో రొటేట్ అవుతున్న ఇమేజ్ కనిపించింది కదా. దానికి ఎన్ని ముఖాలు కనిపిస్తున్నాయి. మీకు ఒక ముఖమే కనిపించిందా? లేక రెండు ముఖాలు కనిపించాయా? రెండు ముఖాలు కనిపించిన వాళ్లు సేఫ్ జోన్ లో ఉంటారు. ఒక ముఖమే కనిపించిన వాళ్లకు మాత్రం schizophrenia డిజార్డర్ ఉన్నట్టు లెక్క. ఈ సమస్య ఉన్నవాళ్లకు రెండు ముఖాలు ఒకేవిధంగా కనిపిస్తాయట.

సండే అంటే ఎలా ఉంటుంది. ఆరోజు పక్కింట్లో నుంచి, ఎదురింట్లో నుంచి.. ఇంకా మనింట్లో నుంచి చికెన్, మటన్, ఫిష్ వాసన ఘుమఘుమలు వెదజల్లుతుంటాయి. కాని.. ఆ వాసన మనకు ఎలా తెలుస్తుంది. ముక్కుతో వాసన చూస్తాం కాబట్టి తెలుస్తుంది. అదో ప్రశ్నా? అని చిరాకు పడకండి. ఎందుకంటే.. సైకోపాత్ లు తమ ముక్కుతో వాసనలను పసిగట్టలేరట. అంటే.. పక్కింట్లో నుంచి ఘుమఘుమలు వస్తున్నా వాళ్లు ఆస్వాదించలేరన్నమాట.

ఇది ఇంకా డేంజర్ బాసు.. చాలా మంది మంచి పనులు చేసేవాళ్లలో కూడా సైకోలు ఉంటారట. అంటే డబ్బులు దానం చేసేవాళ్లు, పేదలకు సాయం చేసేవాళ్లు, అన్నదానం చేసేవాళ్లు, అనాథలను చేరదీసేవాళ్లలోనూ సైకోలు ఉంటారట. కాస్త జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో ఎవరో ఒకరిపై ఎప్పుడై రకరకాల కామెంట్లు చేసేవాళ్లూ సైకోలేనట. శాడిస్టులట. సైకోలు ఎప్పుడు పడితే అప్పుడు ఎమోషనల్ అవ్వరట. తమ చుట్టూ ఉన్నవాళ్లు ఏదైనా ఎమోషన్ కు లోనయినా.. వీళ్లు మాత్రం ఏమాత్రం స్పందించరు. వారికి అవసరమైతేనే ఎమోషనల్ అవుతారట. సైకోలకు అస్సలు భయమంటేనే తెలియదట. ఏ విషయంలోనూ వాళ్లు అస్సలు భయపడరు. ఇక.. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. మేనేజ్ మెంట్, బిజినెస్ లాంటి జాబులు చేసేవారిలో 25 మందిలో ఒకరు బీభత్సమైన సైకో ఉంటారట. వామ్మో… అంటారా? ఇవన్నీ మేం చెబుతున్నవి కావు.. సైంటిస్టులు, రీసెర్చర్లు.. పరిశోధనలు, సర్వేలు చేసి చెబుతున్నవి. మరి.. మీకు వీటిలోని ఏవైనా లక్షణాలు ఉన్నాయా? సరిచూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news