టెన్త్ విద్యార్థిని ఫ్రెయాషాష్.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ఉద్గామ్ స్కూల్ లో చదువుతోంది. ఫ్రెయాకు చిన్నప్పటినుంచి కోడింగ్ అంటే ఇష్టం. సాఫ్ వేర్ లాంగ్వేజీలు నేర్చుకోవడమంటే ఇష్టం. అందుకే యూట్యూబ్ లో చూసి సాఫ్ట్ వేర్ ప్రోగ్రామింగ్ ను నేర్చుకున్నది. గూగుల్ కంపెనీ నిర్వహించిన రాష్ట్రస్థాయి కోడింగ్ కాంపిటిషన్ లో నెగ్గి అందరి ప్రశంసలూ అందుకుంటున్నది.
ఇంతకీ ఫ్రెయా డెవలప్ చేసిన అప్లికేషన్ ఏంటో తెలుసా? ఒత్తిడి ఎదుర్కొంటున్న విద్యార్థుల్లో ఆ ఒత్తిడిని ఎలా తగ్గించాలి.. దానికి ప్రత్యామ్నాయాలు ఏంటి.. అనే విషయాలపై యాప్ ను రూపొందించింది. ఆ యాప్ ప్రకారం… ఒత్తిడితో సతమతమవుతున్న విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేస్తారు. వాళ్ల సమాధానాల ఆధారంగా వాళ్లు ఎంత మేరకు ఒత్తిడిని ఎదుర్కుంటున్నారో లెక్కిస్తారు. దాని ఆధారంగా ఆ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తారన్నమాట. ఈ యాప్ గూగుల్ ప్రతినిధులకు నచ్చడంతో ఈ కాంపిటిషన్ విజేతగా ఫ్రెయాను ప్రకటించారు. ఈ యాప్ త్వరలోనే మార్కెట్ లోకి రానున్నదట.