ఆయన ఉండేది పూరి గుడిసెలో.. అయినా ఎమ్మెల్యేగా గెలిచారు..

తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి డీఎంకే పార్టీ జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత స్టాలిన్‌ మే 7వ తేదీన ప్రమాణం చేయనున్నారు. అయితే డీఎంకే కూటమితో కలిసి పోటీ చేసిన ఓ పేద నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. ఆయనే కె.మరిముత్తు.

he lives in hut but won as mla

తమిళనాడులోని తిరుతరైపూండి నియోజకవర్గం నుంచి సీపీఐ తరఫున కె.మరిముత్తు పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా అన్నాడీఎంకే నుంచి సురేష్‌ కుమార్‌ పోటీ చేశారు. సురేష్‌ కుమార్‌ ధనవంతుడు. దీంతో ఎన్నికల్లో బాగానే ఖర్చు పెట్టాడు. అయితే మరిముత్తు పేద వ్యక్తి. అయినప్పటికీ ఎన్నికల్లో సురేష్‌ కుమార్‌పై 29,102 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆశ్చర్యానికి గురి చేశారు. గుడిసెలో ఉంటున్న ఆయన ఎమ్మెల్యేగా గెలిచారంటే ఆయన ఎంతటి నిజాయితీ పరుడో ఇట్టే అర్థం అవుతుంది.

మరిముత్తుకు గ్యాస్‌ స్టవ్‌ కూడా లేదు. కట్టెల పొయ్యి మీదే వంటలు చేసుకుంటారు. ఉండేది పూరి గుడిసెలో. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.79,304 అని ప్రకటించారు. ఇక చేతిలో రూ.3000 నగదు మాత్రమే ఉందని, బ్యాంకులో రూ.58,156 ఉన్నాయని, తన భార్య వద్ద రూ.1000 ఉన్నాయని అన్నారు. తన భార్య పేరిట 75 సెంట్ల భూమి ఉన్నట్లు తెలిపారు. కాగా రెండు సంవత్సరాల కిందట వచ్చిన గజ తుఫాను కారణంగా వారి గుడిసె ధ్వంసమైంది. దీంతో ఓ ఎన్‌జీవో రూ.50వేలు సహాయం చేసింది. అయితే తనలాగే గుడిసె కోల్పోయి, పట్టాలేని ఓ వ్యక్తికి ఆయన ఆ మొత్తాన్ని ఇచ్చారు. అంతటి నిజాయితీ ఉన్న అసలైన నేత కనుకనే ఎమ్మెల్యే అయ్యారు.