చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో సమయాన్ని వెచ్చించకుండా సక్రమ దారిలో పెట్టడానికి చూస్తారు. అది నిజంగా తప్పు. పిల్లలతో ఎప్పుడైతే తల్లిదండ్రులు సమయాన్ని వెచ్చిస్తారో అప్పుడే వాళ్ళని మంచి అడుగుజాడల్లో నడిపించగలరు. మీ పిల్లలకి ఇప్పుడే మంచి ఫెన్సింగ్ వేస్తే భవిష్యత్తులో సరిగ్గా సరైన మార్గంలో నడుస్తారు. అలా నడవాలి అంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి.
ప్రేమ ఆప్యాయతలతో పెంచడం :
పిల్లలకి మంచి నేర్పాలి. ప్రేమ ఆప్యాయతలతో వాళ్ళతో మెలగడం చేయాలి. వాళ్లతో మీరు మీ సమయాన్ని వెచ్చించి కథలు లేదా మంచి విషయాలు చెప్పాలి. సరదాగా ఆటలాడుకోవడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల వాళ్లు కూడా మీతో ఓపెన్ అవుతారు.
మీ భావాలని వాళ్ళతో పంచుకోవడం:
మీ భావాలని, మీ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళతో షేర్ చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ వుండండి. ఇలా చేస్తే వాళ్ళు కూడా ఎన్నో విషయాలని తెలుసుకుంటారు.
మీ పిల్లలకి రోల్ మోడల్ అవ్వండి:
పిల్లలు మీ నుంచి చాలా నేర్చుకుంటారు. కాబట్టి మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటారో వాళ్లు మీ నుంచి నేర్చుకుని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఎప్పుడైతే ఇలా ఆదర్శంగా తీసుకుని అనుసరిస్తారో.. అప్పుడు కచ్చితంగా వాళ్లు మంచి దారిలో వెళ్లడానికి వీలవుతుంది.
అలానే నిజాయితీగా ఉండడం, సహాయం చేసే గుణాలు ఉండడం, ఇతరులను గౌరవించడం అసత్యం పలకకుండా ఉండడం, ఎవరినీ దూషించుకుండా ఉండటం లాంటివి నేర్పించాలి. ఇలా చేస్తే వాళ్ళు తప్పులు చేయకుండా జీవితంలో మంచి దారిలో వెళ్లడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారో గమనించి మంచిగా నడుచుకునేలా చెయ్యాలి.