స్ఫూర్తి: డిగ్రీ చదివాడు కానీ.. రూ.50 లక్షల‌ జీతం…!

-

కొంతమంది సక్సెస్ ని చూస్తే చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. ఈ కుర్రాడు చదివింది డిగ్రీ కానీ జీతం మాత్రం 50 లక్షలు. మరి ఇక ఇతను సక్సెస్ గురించి చూసేద్దాం. చాలామంది పిల్లలు పెద్ద చదువులు చదువుకుని ఎక్కువ ప్యాకేజీ తో ఉద్యోగాన్ని సంపాదించాలని కలలు కంటూ ఉంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. హర్షల్ మాత్రం తన కలల్ని నిజం చేసుకున్నాడు ప్రముఖ టెక్ కంపెనీలో జాబ్ అందులో గూగుల్ వంటి అతిపెద్ద టెక్కుదిగ్గజ కంపెనీలో జాబ్ సంపాదించాడు.

 

ఇది మామూలు విషయమా..? పైగా అది కూడా ఒక సాధారణ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి. పూణేలోని ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థి హర్షల్ జైకర్ గూగుల్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఐటీ జాబ్ కొట్టాడు. ఏకంగా ఏడాదికి 50 లక్షల ప్యాకేజీ తో ఉద్యోగాన్ని పొందాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు ఆదర్శంగా నిలిచాడు.

హర్షల్ కి ఉన్న కోడింగ్ స్కిల్స్ తోనే ఇది సాధ్యమైంది. హర్షల్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఐటీ కంపెనీలో రాణించాలని కష్టపడి గూగుల్ కంపెనీలో జాబ్ కొట్టేసాడు. ఎప్పటికప్పుడు తన స్కిల్స్ ని పెంచుకుంటూ అందరికీ ప్రేరణగా నిలిచాడు హర్షల్.

బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసాడు ఆ టైంలో టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉండడంతో టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవాలని సొంతంగా కోడింగ్ స్కిల్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. పూణేలోని బ్లాక్ చైన్ టెక్నాలజీలో మాస్టర్ చదువుతున్నప్పుడు ట్రైనింగ్ తీసుకున్నాడు మొత్తం మీద స్కిల్స్ అన్నిటిని పెంచుకుని హర్షల్ ఏకంగా 50 లక్షలు ప్యాకేజీతో గూగుల్ లో జాబ్ ని సంపాదించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news