ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం – ఈటెల రాజేందర్

-

ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం తీసుకువచ్చారని ఆరోపించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకు టార్గెట్లు పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట సభలపై కేసీఆర్ కి నమ్మకం సన్నగిల్లిందన్నారు. బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది మొత్తం 14 రోజులు మాత్రమే జరిగాయన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజుల పాటు సమావేశాలు జరిగేవన్నారు. ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళుగా.. పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసే వాళ్ళుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నేడు 4 పార్టీలే ఉన్నాయని.. ఉమ్మడి రాష్ట్రంలో 15 పార్టీలు ఉండేవన్నారు. అన్ని పార్టీలతో BAC సమావేశం నిర్వహించేవారని గుర్తు చేశారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీని BAC సమావేశానికి పిలువలేదన్నారు.

ఒక్క ఎమ్మేల్యే ఉన్న జయప్రకాష్ నారాయణ కూడా BAC సమావేశంలో పాల్గొనేవారన్నారు. బీజేపీ సభ్యులకు అసెంబ్లీలో ఒక్క రూం కేటాయించాలని అన్నా పట్టించుకోలేదన్నారు. సభ సజావుగా సాగిందని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు ఈటెల. స్పీకర్ మా వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news