స్ఫూర్తి: 74 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చిన వృద్ధురాలి జీవితం చూడాల్సిందే…!

-

ఈమె ధైర్యానికి… ఈమె సాహసానికి సెల్యూట్ చెయ్యాల్సిందే. జీవిత చరమాంకంలో ఓ యుద్ధమే చేసింది! ఎవరు ఈమె మాట వైపు నిలబడకపోయిన… ఎందరో మంది ఎంత హెచ్చరించినా… ఈమె అనుకున్నది చేసింది. నిజంగా ఈమె 74 ఏళ్ల వయసు లో జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకుంది. ఇప్పుడు చక్కగా ‘అమ్మ’ అనే పిలుపులో ఉన్న కమ్మదనాన్ని తనివితీరా ఆస్వాదిస్తోంది. అసలు ఏం జరిగింది..?, ఈమె చేసిన ఆ సాహసం ఏమిటి..? ఈమె గురించి మరి ఇప్పుడే పూర్తిగా చూడండి…

ఈ వృద్ధురాలు ఏడాదిన్న క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషన్ గా మారింది. 74 ఏళ్ల వయసులో గర్భవతి అయ్యి ఏకంగా కవల పిల్లలకు జన్మనిచ్చింది ఈ భామ. చుట్టాలు, చుట్టుపక్క వాళ్ళు ఎన్ని అన్నా ఈమె ఎంత మాత్రం లెక్కజేయలేదు. ఈమె అందరికి కేవలం ఒకే ఒక్క మాట చెప్పేది. అదే.. ‘అమ్మ అని పిలిపించుకోవాలి’! అని. అయితే అందరు అన్న వాటన్నింటినీ కూడా ఈమె పక్కన పెట్టేసి ఇద్దరి కవలలకు జన్మనిచ్చింది. అప్పటికి ఆమె వయసు 74 ఏళ్లు. ఇది అరుదైన ఘటనగా గుంటూరులోని అహల్య ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈమె పేరు మంగాయమ్మ. ఈమె తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నెలపర్తిపాడుకు చెందినది.

కృత్రిమ గర్భదారణ పద్ధతిలో 2019 సెప్టెంబర్‌ 6న మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరినీ కూడా ఎంతో గారాబంగా ఈ వృద్ధ దంపతులు పెంచారు. పిల్లలకు ఏడాది పుట్టిన రోజు వేడుకలు జరిపిన మూడు రోజులకే తండ్రి సీతారామరాజారావు మృతి చెందారు. మంగయమ్మే వాళ్లడిరని అప్పటి నుండి పెంచుతోంది. భర్త మృతితో మంగాయమ్మ బిడ్డల సంరక్షణ కోసం ఓ మహిళను నియమించారు. బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వాళ్ళు కూడా ఆ పిల్లల్ని ఎంతో బాగా చూసుకుంటారు. ఆ కవలలు అంటే ఇష్టం కూడా. మంగాయమ్మ తన పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటికే చేయాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆమె తర్వాత తన అక్క పిల్లలు చూసుకుంటారని… ఆ పిల్లల గురించి దిగులు చెందవద్దన్నారు. ఆమె నూరేళ్లు బతికి ఆ పిల్లలని ఇలానే చూసుకోవాలని అంతా అంటున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news