బ్రేకింగ్ : అశోక్ గజపతిరాజుకి ఏపీ సర్కార్ షాక్

-

రామతీర్థం రగడ కొనసాగుతుండగా… ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామతీర్థం ఆలయ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి…టీడీపీ నేత అశోక గజపతిరాజును తొలగించింది. రామతీర్థం సహా మూడు ఆలయాల చైర్మన్ పదవుల నుంచి ఉద్వాసన పలికింది. దేవాలయాల పర్యవేక్షణలో అశోక గజపతిరాజు విఫలమయ్యారని ఉత్తర్వుల్లో పేర్కొంది.  ఇప్పటివరకు వంద ఆలయాల చైర్మన్ బాధ్యతల నుంచి..అశోక్ గజపతిరాజును తప్పించింది దేవాదాయ శాఖ. అశోక గజపతిరాజును చైర్మన్‌ పదవి నుంచి తప్పించడంపై ఫైరయ్యారు చంద్రబాబు. ప్రభుత్వం కక్ష సాధింపు కాక మరేమిటని ప్రశ్నించారు.

ఇక విజయనగరం జిల్లా…రామతీర్థం రాజకీయ వివాదానికి వేదికైంది. రాములోరి విగ్రహ ధ్వంసంతో… పొలిటికల్ హీట్ పెరిగింది. చంద్రబాబు ఆలయ సందర్శనకు వెళ్లడం, అంతకు ముందే విజయసాయిరెడ్డి అక్కడికి చేరుకోవడం…ఇటు బీజేపీ నేతలు కూడా సందర్శనకు ప్రయత్నించడంతో టెన్షన్‌ వాతావరణం కన్పించింది. విజయసాయిరెడ్డి కొండపైకి వెళ్లొచ్చిన తర్వాత… చంద్రబాబు టీడీపీ నేతలతో కలిసి కొండపైకి వెళ్లారు. ఐతే అప్పటికే ఆలయం మూసి ఉండటంతో…జరిగిన ఘటనపై పూజారాలను అడిగి వివరాలను తెలుసుకున్నారు. కోనేరును సందర్శించిన తర్వాత… నేతలతో కలిసి కొండ మీద నుంచి దిగివచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news