నైకా ఉత్పత్తులు గురించి ఆడవారికి వేరే చెప్పనక్కర్లేదు. తమ అందాన్ని మరింత పెంచే నైకా ఉత్పత్తులంటే మహిళలకు ఎంతో ఇష్టం. అయితే ఈరోజు మనం ఆ నైకా సంస్థ వ్యవస్థాపకురాలైన ఫల్గుణి నాయర్ గురించి తెలుసుకుందాం..ఈరోజే ఎందుకంటే..ఇండియాలోనే ఏడవ మహిళా బిలియనీర్ గా స్థానం సంపాదించారు. సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘నైకా’ను నిర్వహిస్తున్న FSN ఇ-కామర్స్ వెంచర్స్ ఈరోజు స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా అడుగుపెట్టింది.
నైకా భారతదేశపు మొట్టమొదటి యునికార్న్ స్టార్టప్, ఒక మహిళ నేతృత్వంలో, 2012లో ఫల్గుణి నాయర్‌చే స్థాపించబడిన ఈ సంస్థ మొబైల్, వెబ్ సైట్ ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 58 ఏళ్ల నాయర్ కేవలం ఆరుగురు భారతీయ మహిళా బిలియనీర్‌లతో స్టాచ్ చేశారు. ఇప్పుడు ఆమె అత్యంత సంపన్న స్వీయ-నిర్మిత బిలియనీర్‌గా స్థానం పొందారు. బుధవారం జరిగిన లిస్టింగ్ వేడుకలో, నాయర్ మాట్లాడుతూ, ” ఇండియాలో పుట్టి, ఇండియన్స్ యాజమన్యంతో వృద్ధిచెందిన నైకా ప్రయాణం మీ అందరిరికి స్పూర్తినిస్తుందని అని నమ్ముతున్నాను” అన్నారు.
నైకా అంటే సంస్కృతంలో నటి అని అర్థం. భారతీయ యువకులలో – ప్రధానంగా మహిళలు – వారి స్థానిక దుకాణాలలో ఆఫర్‌తో పోలిస్తే ఎక్కువ ప్రొడెక్ట్స్ ఉండే బ్రాండ్‌లను విక్రయించడానికే ఇష్టపడతారు. భారతదేశంలో ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా అనేక గ్లోబల్ బ్రాండ్‌లను ఉత్పత్తి చేయటమే నేను ఈ నైకా బ్రాండ్లను ఇష్టపడటానికి కారణం అని 30 ఏళ్లగా విశ్వసనీయ కస్టమర్ గా ఉన్న సనేయా AFP వార్తా ఏజెన్సీకి తెలిపారు.
నైకా ప్రజాదరణ పెరిగేకొద్దీ, కత్రినా కైఫ్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు, ఇతర సోషల్ మీడియా ప్రభావశీలులు, కొందరు ప్రముఖులు నైకా ఉత్పత్తుల గురించి పబ్లిసిటీ ఇవ్వటంతో దాని బ్రాండ్ ఆకర్షణ మరింత పెరిగింది. 2015 నుండి నైకా సొంతంగా తయారుచేసిన వస్త్రాలు, గృహోపకరణాలను కూడా అమ్మటం మొదలుపెట్టింది. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఈ బ్రాండ్ కు ఇండియాలోనే 40 సీటీస్ లో 80 స్టోర్లును స్థాపించటం విశేషం.