ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క-సారలమ్మ జాతరకు తేదీలను ఖరారు చేసింది ప్రభుత్వ. సమ్మక్క- సారలమ్మ మహా జాతర-2022 తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 16-19 వరకు ఈ మహా జాతర జరగనుంది. 16న సారలమ్మ కన్నెపల్లి నుండి గద్దెపైకి రాక, 17న చిలకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రాక, 18న భక్తులకు అమ్మవార్ల దర్శనం, 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.
ఏటా కోట్ల మంది దర్శించుకునే మేడారం మహాజాతరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇటీవల రూ. 75 కోట్లతో మేడారం అభివ్రుద్ది పనులకు శ్రీకారం చుట్టింది. తాజాగా తేదీలు కూడా ఖరారు కావడంతో పనుల ఊపందుకోనున్నాయి. ప్రతీ ఏటా మన రాష్ట్రం నుంచే కాకుండా చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అమ్మవార్లను దర్శించుకునేందకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.