తన ఇంటినే స్కూల్‌గా మార్చేసిన రిటైర్డ్ ఐఏఎస్

392

ఐఏఎస్ కాబట్టే ఆయనకు చదువు విలువ తెలుసు. తన లాగా ఓ పది మంది తయారైనా చాలు.. తన జన్మ సార్థకం అవుతుందనుకున్నాడో ఏమో అందుకే.. తన ఇంటిని స్కూల్ కోసం గిఫ్ట్‌గా ఇచ్చేశారు.

ఆయనకు చదువు విలువ తెలుసు. చదువు కోసం పేద విద్యార్థులు పడే తపన తెలుసు. అందుకే.. తన ఇంటినే స్కూల్‌గా మార్చేశారు. చదువుకోవాలంటే ఓ బడి కావాలి.. ఇప్పటికప్పుడు బడి కట్టించడం.. దాని కోసం పర్మిషన్లు.. గట్రా ఇదంతా టైమ్ వేస్ట్ అనుకున్నారో ఏమో కానీ.. తన ఇంటినే బడి కోసం దానం చేశారు. తన ఇంటిని బడిగా మార్చేశారు.

Retired IAS gifted his house for school

ఆయన ఏదో సాదాసీదా వ్యక్తి అనుకునేరు. రిటైర్డ్ ఐఏఎస్ ఆయన. పేరు అంబరీష్. ఐఏఎస్ కాబట్టే ఆయనకు చదువు విలువ తెలుసు. తన లాగా ఓ పది మంది తయారైనా చాలు.. తన జన్మ సార్థకం అవుతుందనుకున్నాడో ఏమో అందుకే.. తన ఇంటిని స్కూల్ కోసం గిఫ్ట్‌గా ఇచ్చేశారు.

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల కోసం తన ఇంటిని ఇచ్చేశారు. తన ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్‌ను విద్యా కమిషనర్‌కు కలిసి అప్పగించారు. వెంటనే తన ఇంటిని స్కూల్‌గా మార్చాలని కమిషనర్‌ను అంబరీష్ కోరారు. దీంతో ఇన్ని రోజులు ఇల్లుగా ఉన్న ఆ ప్రాంతం కొన్ని రోజుల్లో స్కూల్ పిల్లలతో కళకళలాడనుంది. ఆయన చేసిన ఈ పనికి ఆ ఊరి వాళ్లంతా తెగ మెచ్చుకుంటున్నారు.