సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ ఇటీవలే ఐఫోన్ ఎస్ఈ 2020ని విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.42,500గా ఉంది. అయితే దీన్ని రూ.38వేలకే కొనుగోలు చేయవచ్చు. అందుకుగాను వినియోగదారులు www.indiaistore.com అనే సైట్‌ను సందర్శించాలి. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.3600 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. దీంతో ఫోన్ ధర రూ.38,900 అవుతుంది. కాగా ఈ ఆఫర్‌ను Redington అనే అంతర్జాతీయ సప్లయి చైన్ కంపెనీ వినియోగదారులకు అందిస్తోంది.
ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020 ఫోన్‌లో.. ఎ13 బయానిక్ ఫాస్టెస్ట్ చిప్, గ్రేట్ బ్యాటరీ లైఫ్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌ను త్వరలో విక్రయించనున్నారు. అయితే ఈ ఫోన్‌ను ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేసే సదుపాయాన్ని ఇండియా ఐస్టోర్‌లో అందిస్తున్నారు. దీంతోపాటు క్యాష్‌బ్యాక్ వస్తుంది కనుక.. తక్కువ ధరకే కొత్త ఐఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
కాగా ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. కానీ అందులో ఎలాంటి ఆఫర్‌ను ఆ సంస్థ ప్రకటించలేదు. ఇక లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తే దేశవ్యాప్తంగా ఉన్న 3500కి పైగా ఆథరైజ్డ్ స్టోర్లు, ఇతర మొబైల్ షాపుల్లోనూ ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.