స్ఫూర్తి: మహిళలు పంట పండించలేరన్నారు.. అది తప్పని ముప్పై లక్షలు సంపాదిస్తూ రుజువు చేసిందీమె..!

-

మహిళలు వ్యవసాయం చేయలేరని.. నీవు కూడా విజయం సాధించలేవని చాలామంది ఈమెని అన్నారు. కానీ వాళ్ళందరికీ ఆమె సాధించే సమాధానం చెప్పింది. వాళ్ళని అన్నీ కూడా తప్పు అని ప్రూవ్ చేశారు సంగీత పింగ్లే. ఈమె మాటొరి గ్రామం లో ఒక రైతు. 2004వ సంవత్సరంలో ఈమె రెండవ పిల్లని కోల్పోయారు. 2007లో రోడ్ యాక్సిడెంట్ లో తన భర్తని కోల్పోయారు.

అప్పుడు ఆమె 9 నెలల గర్భిణీ. నిజంగా పదేళ్లపాటు ఈమె ఎంతో బాధలో ఉన్నారు. 2017 లో ఈమె కుటుంబం నుంచి వేరేగా చేయాల్సి వచ్చింది. అయితే సంగీత వాళ్ళ మామ గారికి 13 ఎకరాల పొలం ఉంది. అయితే కేవలం ఆ పొలం మాత్రమే వాళ్లకి ఆదాయం. ఇంటి పనులతో పిల్లల్ని చూసుకోవడం ఓ పక్క వ్యవసాయం చేయడం ఈమె అలవాటు చేసుకున్నారు. అయితే చాలా మంది సంగీతని ఏదో ఒకటి అనడం, నువ్వు చేయలేవు అనడం, ఇలాంటివి అనేవారు.

అయినప్పటికీ ఆమె కృంగిపోలేదు. ఆమె మీద ఆమె నమ్మకం పెట్టుకుని ఎంతగానో శ్రమించి విజయవంతమయ్యింది. 13 ఎకరాల్లో ద్రాక్ష మరియు టమాటాలను పండించి లక్షల్లో ఆమె సంపాదిస్తోంది. అయితే ఎందులోనైనా ఒడిదుడుకులు ఉంటాయి. ఆమె ఇలాంటి వాటిని ఎదుర్కొని ఎంతగానో శ్రమించి… ఈ స్థాయికి వచ్చారు.

800 నుండి 1000 టన్నుల ద్రాక్ష పళ్లతో ఆమె 25 నుండి 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. తన పిల్లలకి కూడా మంచి విద్యను అందిస్తున్నారు. మహిళని కదా అని అనుకోకండి. ఆడవాళ్ళు కూడా అన్నిట్లోనూ రాణించగలరు.. విమర్శలు పట్టించుకోకుండా నమ్మకాన్ని పెట్టుకుని ముందుకు వెళితే ఎవరైనా సాధించగలరు అని ఈమెను చూస్తే అర్థమవుతుంది. నిజంగా ఇలాంటి మహిళలు ఎందరికో ఆదర్శం.

Read more RELATED
Recommended to you

Latest news