మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలోని బాత్ రూమ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విధితమే. ఈ ఘటనలో ఇప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటు ఏడుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. తాజాగా సీఎంఆర్ కాలేజీ బృందం రాష్ట్ర మహిళా కమిషన్ విచారణ జరిపింది. విచారణ అనంతరం కాలేజీ ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడారు.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఎదుట విచారణకు హాజరయ్యాం. సీసీ కెమెరాల ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్తామని తెలిపారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీహార్ కు చెందిన నందకిషోర్, గోవింద్ కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. సీసీ కెమెరాలు గమనించిన విద్యార్థినులు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొద్ది రోజుల పాటు ఆందోళనలు సైతం చేశారు. విద్యార్థినులు ఆందోళన చేయడంతో హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని యజమాన్యం సస్పెండ్ చేసింది.