కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఇంజినీర్లు, ఉన్నతాధికారులను ప్రశ్నించిన కమిషన్ తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన ఐఏఎస్ రామకృష్ణారావుకు ఇవాళ నోటీసులు జారీ చేసింది. అలాగే వాటర్ రిసోర్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన వి.ప్రకాశ్ పలు నిర్మాణ సంస్థలను బహిరంగ విచారణకు పిలువబోతున్నట్టు తెలుస్తోంది. ఓవైపు విచారణ ప్రక్రియ కొనసాగిస్తూనే.. మరోవైపు విచారణకు సంబంధించిన రిపోర్టును కమిషన్ తయారు చేస్తోంది.
ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన విచారణ రిపోర్టును కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోస్ తయారు చేశారు. మార్చి నెలాఖరు వరకు కమిషన్ పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఈసెషన్ లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగించే కసరత్తు చేస్తోంది. మాజీ ఈఎన్సీలను మరోసారి బహిరంగ విచారణ పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫైనాన్స్ అండ్ పాలసీ, టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తి చేసింది కమిషన్.