బిడ్డను వీపుకు కట్టుకుని నది దాటుతూ మహిళా హెల్త్‌ అసిస్టెంట్‌ విధులు..!

-

ప్రభుత్వ ఉద్యోగులు అంటే కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. సరిగ్గా పనిచేయరు. ప్రజలను అస్సలు పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం అలా కాదు. అంకిత భావంతో సేవలు అందిస్తారు. తాము ఎన్ని కష్టాలు పడినా సరే ప్రజలకు సేవ చేస్తారు. అవును.. ఇప్పుడు చెప్పబోయే ఆ మహిళ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

జార్ఖండ్‌కు చెందిన హెల్త్‌ అసిస్టెంట్‌ మంతి కుమారి రోజూ గ్రామాలకు వెళ్లి చిన్నారులకు టీకాలను ఇస్తుంటుంది. అయితే ఆమెకు ఒక కుమార్తె ఉంది. విధులు నిర్వర్తించాలంటే ఆమె రోజూ దూరం వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇంటి దగ్గర కుమార్తెను వదిలివెళ్లాలి. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఆమె తన కుమార్తెను వీపుకు కట్టుకుని తనతోపాటే తీసుకెళ్తోంది.

ఈ క్రమంలోనే ఆమె అక్కడి తిసియా, గొయిరా, సుగబంధ్‌ గ్రామాలకు రోజూ వెళ్తోంది. వీపుకు కుమార్తెను కట్టుకుని దారిలో ఉండే నదులను దాటుతూ ఆమె తన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తోంది. దీంతో ఆమెను అందరూ ప్రశంసిస్తున్నారు. ఆమె నది దాటుతుండగా తీసిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతో బాధ్యతగా, ఎన్ని కష్టాలను అయినా ఎదుర్కొని ఆమె సేవ చేస్తుండడం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఆమెను అందరు అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version