కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో యానాం ఓల్డేజ్ హోం ఉంది. ఆ ఓల్డేజ్ హోం ఇప్పటికే పేద ప్రజలకు 28 రకాల సేవలను అందిస్తోంది.
ఉదయం మనం బయట టిఫిన్ చేయాలంటే.. ఎంత లేదన్నా కనీసం ప్లేటు టిఫిన్‌కు రూ.20 నుంచి రూ.30 చెల్లించాలి. ఇక మధ్యాహ్నం భోజనం అయితే కనీసం రూ.60 వరకు చెల్లించాలి. అయితే ఒక మోస్తారు ఆదాయం కలిగిన వారికి ఇలా నిత్యం బయట ఫుడ్‌ను తినడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పేద, మధ్య తరగతి వర్గాలకు మాత్రం ఇలా రోజూ బయట అంత ఖర్చు పెట్టి భోజనం చేయడం ఇబ్బందిగానే ఉంటుంది. అయితే సరిగ్గా ఇలాంటి వారి కోసమే అక్కడ కేవలం రూ.5కే భోజనం వడ్డిస్తున్నారు. అవును నిజమే.. ఇంతకీ అసలు అలా చేస్తున్నది ఎవరంటే…
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో యానాం ఓల్డేజ్ హోం ఉంది. ఆ ఓల్డేజ్ హోం ఇప్పటికే పేద ప్రజలకు 28 రకాల సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే ఆ ఓల్డేజ్ హోం వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లాడి కృష్ణారావు తన 56వ జన్మదినం సందర్భంగా ఇవాళ్టి నుంచి మన భోజనం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కేవలం రూ.5 కే భోజనం అందిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న రూ.5 మధ్యాహ్న భోజనం లాగే ఆ పథకాన్ని ప్రారంభించారు.
అయితే రూ.5 కే భోజనం అన్నారు కదా అని అది నాణ్యత తక్కువగా ఉంటుందనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే.. పేరుకే అది రూ.5 భోజనం. కానీ నిజానికి ఆ భోజనం ఒక ప్లేట్ ఖర్చు రూ.40 వరకు అవుతుంది. అందులో అన్నం, రెండు కూరలు, సాంబారు, పెరుగు ఉంటాయి. ఆ పదార్థాలు చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి వర్గానికి చెందిన వారితోపాటు అనాథ వృద్ధులు, పిల్లలకు ఈ భోజనాన్ని అందిస్తున్నారు. కాగా మల్లాడి కృష్ణారావు ప్రస్తుతం పుదుచ్చేరి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేస్తుండడం విశేషం. ఆయన ఇదే కాదు, పేదలకు ఇప్పటికే ఎన్నో సేవలను అందించారు. 13 మంది వికలాంగ చిన్నారులకు ఆయన ఫించను మంజూరు చేయించారు. ఇప్పటి వరకు 62 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆయన వైద్య సహాయం అందించారు. ఈ క్రమంలోనే ఇప్పుడాయన అక్కడ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.