నాపంట యాప్… అగ్రికల్చర్ ఎన్ సైక్లోపీడియా.. డెవలప్ చేసిన వరంగల్ యువకుడు

-

మీకు ఏదైనా సమాచారం కావాలంటే ఏం చేస్తారు.. గూగుల్ లో సెర్చ్ చేస్తారు లేదంటే వికీపీడియా లేదా మరో పీడియా నుంచి సమాచారం తీసుకుంటారు. మరి.. రైతుల పరిస్థితి ఏంటి? ఏదైనా పంట వేయాలంటే ఏ విత్తనాలు బాగుంటాయి.. మార్కెట్ లో వాటి ధర ఎలా ఉంటుంది… ఏ పెస్టిసైడ్స్ వాడాలి.. ఎన్ని రోజుల పంటలు వేయాలి… ఏ సీజన్ లో ఏ పంట వేయాలి.. దిగుబడి బాగా రావాలంటే ఏం చేయాలి.. ఇలా వంద రకాల సందేహాలు ఉంటాయి రైతులకు. కొంతమంది రైతులకు వీటిపై అవగాహన ఉండవచ్చు గాక. లేని వాళ్ల పరిస్థితి. దేని గురించైనా సరైన అవగాహన లేక.. దిగుబడి రాక ఆత్మహత్య చేసుకునే రైతుల పరిస్థితి ఏంటి.. ఇదిగో ఈ ప్రశ్నలే వరంగల్ కు చెందిన నవీన్ కుమార్ అనే యువకుడిని కలిచివేశాయి. అది కూడా ఓ రైతు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోయి.. పంట పండక ఆత్మహత్య చేసుకోవడాన్ని కళ్లారా చూసి.. కలత చెంది.. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అలా పుట్టిందే నాపంట అనే యాప్.

అవును.. నాపంట అనే యాప్.. వ్యవసాయానికి సంబంధించిన ఎన్ సైక్లోపీడియా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ యాప్ లోని సలహాలు, సూచనలను అనుసరించి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని 75 వేల మంది రైతులు పంటలు పండిస్తున్నారు. అధిక దిగుబడి సాధిస్తున్నారు.

ఇక్రిశాట్, ఐఐఐటీ హైదరాబాద్ సపోర్ట్ తో దాదాపు ఓ మూడు నెలలు రైతుల మీద, పంటల మీద పరిశోధన చేసి నాపంట యాప్ ను అభివృద్ధి చేశాడు నవీన్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లోని 6400 గ్రామాల్లో 75 వేల మంది రైతులు ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నారు. రోజూ 3000 మంది దాకా యాప్ లో లాగిన్ అవుతారు. 25 వేల మంది దాకా రోజూ యాప్ లో సమాచారం కోసం వెతుకుతుంటారని నవీన్ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version