కంగనా రనౌత్ లీడ్ రోల్ గా జీ స్టూడియోస్ నిర్మించిన సినిమా మణికర్ణిక. ఝాన్సీ రాణి లక్ష్మీ భాయ్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమాను సగానికి పైగా క్రిష్ డైరెక్ట్ చేయగా మిగతా సగం కంగానా డైరెక్ట్ చేసింది. ఈ సినిమా విషయంలో క్రిష్, కంగనాల మధ్య గొడవ అయ్యింది. సినిమా రిలీజ్ ముందు మాట్లాడితే బాగోదని ఆఫ్టర్ రిలీజ్ సినిమాపై స్పందించాడు క్రిష్. తాను చేసుంటే మణికర్ణిక బంగారం అయ్యేదని ఇప్పుడు మీరు చూస్తుంది వెండి అని అన్నాడు క్రిష్.
ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కలక్షన్స్ మాత్రం బాగున్నాయి. బాలీవుడ్ లో కూడా పోటీగా పెద్ద సినిమాలేవి లేకపోవడం వల్ల సినిమా వసూళ్లు అదరగొడుతున్నాయి. సినిమా చూసిన అక్కినేని కోడలు సమంత కంగనాని పొగడ్తలతో ముంచెత్తుతుంది. మణికర్ణిక సినిమా చూసి సమంత ఎలా స్పందించింది అంటే మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ జాన్సి అయితే.. కంగనా రనౌత్ ది ఫ్రీకింగ్.. క్వీన్ ఆఫ్ అవర్ హార్ట్స్ అంటూ ట్వీట్ చేసింది. ఆమె నాకు ఇష్టమైన హీరో అని చెప్పడం విశేషం. ఇష్టమైన హీరోయిన్ అనకుండా హీరో అని ఎందుకంది అంటే ఆమె చేసే పాత్రలు ఆమెను హీరోని చేశాయని అంటున్నారు.