ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. 11 ఏళ్లకే యూస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ సైట్ ను హ్యాక్ చేసేశాడు..!

-

11 ఏళ్ల పిల్లలు ఏం చేస్తారు చెప్పండి. ఆరో ఏడో చదువుతూ తమ బాల్యాన్ని అలా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్లను మీరు హ్యాకింగ్ గురించి ఏదైనా అడిగితే బిక్కమొహం పెట్టుకొని చూస్తారు. కానీ.. 11 ఏళ్ల ఎమ్మెట్ బ్రేవర్ మాత్రం హ్యాకింగ్ ను ఓ ఆటాడిస్తాడు. కాకలు తీరిన హ్యాకర్లకు అంతు పట్టని సమస్యలను కూడా ఇట్టే తీర్చేస్తాడు.

ఇంతకీ ఈ పిల్లాలు ఎలా లైమ్ లైట్ లోకి వచ్చాడంటే.. రీసెంట్ గా 6 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న చిన్నారుల్లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రతిభను వెలికి తీయడం కోసం యూఎస్ లో డెఫ్ కాన్ సెక్యూరిటీ కన్వెన్షన్ అనే ఓ కంటెస్ట్ ను నిర్వహించారు. ఆ కంటెస్ట్ లో ఈ చిచ్చర పిడుగు యూఎస్ ప్రభుత్వ అధికారిక ఎన్నికల ఫలితాల వెబ్ సైట్ ను పది నిమిషాల్లో హ్యాక్ చేశాడు. దాన్ని స్వాధీనం చేసుకొని సైట్ లో మార్పులు చేశాడు. పెద్ద పెద్ద హ్యాకర్లు కూడా ఇలా సైట్ ను హ్యాక్ చేసి సైట్ లో మార్పులు చేయడానికి గంటలు గంటలు సమయం తీసుకుంటారట. కానీ.. ఈ బుడ్డోడు పదినిమిషాల్లోనే డేటాబేస్ తో సహా వెబ్ సైట్ మొత్తాన్ని హ్యాక్ చేసి తన చేతల్లోకి తీసుకోవడంతో.. సైబర్ సెక్యూరిటీ నిపుణులు మనోడిని చూసి ఔరా అంటున్నారు. బ్రేవర్ ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఇక.. అందరి కంటే ముందుగా పదినిమిషాల్లోనే సైట్ ను హ్యాక్ చేసిన బ్రేవర్ నే డెఫ్ కాన్ సెక్యూరిటీ కన్వెన్షన్ కు విజేతగా ప్రకటించారట. అదీ సంగతి. వామ్మో.. వీడు బుడ్డోడు కాదు.. చెడుగుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version