లవ్ ఈజ్ బ్లైండ్ అని ఇందుకే అంటారేమో..! సాధారణంగా మనిషి ప్రేమ లో పడాతాడు. కానీ అది ఎప్పుడు కలుగుతుంది అనేది ఎవ్వరికి తెలీదు. ప్రేమకి వయసు తో సంబంధం లేదని మళ్ళీ రుజువయ్యింది. బ్రిటన్ లో 81 సంవత్సరాల మహిళ, ప్రేమ వివాహం చేసుకున్న సంగతి ఇప్పుడు వైరల్ అయ్యింది. పూరిగా కనుక చూస్తే మీరు కూడా తప్పక షాక్ అవుతారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు చెందిన ఐరిష్ జోనిస్ (81) అనే వృద్ధ మహిళ, ఈజిప్ట్ కి చెందిన మహమ్మద్ అహ్మద్ ఇబ్రహీం (35) అనే వ్యక్తితో ఈజిప్టు లో పరిచయం ఏర్పడింది. ఇలా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతని తో ప్రేమ లో పడిన జోనిస్ తరువాత తన ప్రియుడుని కలవడానికి మరో రెండు సార్లు ఈజిప్టు వెళ్ళింది. ఆమె కి ఈజిప్టు వాతావరణం కొంచెం కష్టంగా ఉండడం తో ఏకంగా మహమ్మద్ ను పెళ్లి చేసుకుని యూకే లోనే ఉండిపోవాలని అనుకుంది.
కట్ చేస్తే వయసు లో 45 సంవత్సరాలు చిన్న వాడైనా మహమ్మద్ ను జోనిస్ పెళ్లి చేసుకున్నారు. అయితే జోనిస్ కు 50 సంవత్సరాల వయసున్న ఇద్దరు కొడుకులు ఉండటం విశేషం. కొడుకులు కూడా ఏమాత్రం అడ్డు చెప్పలేదు. ఏది ఏమైనా ఈ వయసులో తనకు నచ్చిన వ్యక్తి తో పెళ్లి చేసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ జంట ఫోటోలు మాత్రం సోషల్ మీడియా లో షికార్లు కొడుతున్నాయి.