ఉద్యోగులు రక్తదానం చేస్తే నాలుగు రోజులు సెలవు

-

బంపర్ ఆఫర్ అంటే ఇదే బాస్. ఉద్యోగులకు పండుగ లాంటి వార్త. అటు సోషల్ సర్వీసు.. ఇక సెలవులు. సూపర్ కదా. వెంటనే రక్తదానం చేయడానికి రెడీ అయిపోయారా? ఆగండాగండి. పూర్తిగా చదవండి ముందు. అది మన రాష్ట్రంలో కాదు. జార్ఖండ్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త స్కీమ్ అది. ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం కోసం.. వాళ్లను ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం.

ఆఫీసు టైమింగ్స్ లో రక్తదానం చేసిన ఉద్యోగులకు సంవత్సరంలో నాలుగు స్పెషల్ కాజువల్ లీవ్స్ (సీఎల్)ను మంజూరు చేయనుందట ప్రభుత్వం. నిజానికి జార్ఖండ్ రాష్ట్రానికి ఏడాదికి మూడు లక్షల యాబై వేల యూనిట్ల రక్తం అవసరం అవుతుందట. కానీ.. వాళ్లకు సమకూరేది మాత్రం లక్షా తొంబై వేల యూనిట్లేనట. అందుకే.. ఉద్యోగులను రక్తదానానికి ప్రోత్సహించేందుకు ఇలా బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రభుత్వం. బాగుంది కదా. ఒకసారి రక్తదానం .. ఏడాదికి నాలుగు అదనపు లీవ్స్.. సూపర్.

Read more RELATED
Recommended to you

Latest news