ఇలా సెల్ఫీ తీసుకుంటుంటే… అలా సెల్లు లాక్కెళ్లిన దొంగ‌..(వైర‌ల్ వీడియో)

-

ఇటీవ‌ల కాలంలో దొంగ‌త‌నాలు ఎక్క‌వ అయిపోతున్నాయి. ఇక తాజాగా చాలా రోజుల తరువాత తనను కలిసిన స్నేహితురాలితో సెల్ఫీ దిగుదామని, ఓ యువతి ప్రయత్నిస్తున్న వేళ, హఠాత్తుగా బైక్ పై వచ్చిన ఓ దొంగ, ఆ సెల్ ఫోన్ ను లాక్కెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సమీపంలో అమర్చిన ఓ సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం కాగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై నిలుచున్న ఓ యువతి, మరో యువతితో కలిసి సెల్ఫీ దిగుతుంటే, ఎరుపు రంగు టీషర్ట్ తో బైక్ పై వచ్చిన ఓ యువకుడు, దాన్ని ఒడుపుగా లాగేసుకుని వెళ్లిపోయాడు.

తమ స్మార్ట్ ఫోన్ తీసుకుని వెళుతున్న అతన్ని వారు ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటనను చూసిన కొందరు స్థానికులు అతన్ని వెంబడించాలని ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వెలువడుతోంది. రోడ్లపై ఈ తరహా పనులేంటని కొందరు మండిపడుతుంటే, జాగ్రత్తగా ఉండాలికదా? అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. ఇక ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news