ఆఫీస్‌లో బొద్దింకల వల్ల భయం.. లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసిన యువతి

-

ఆఫీస్‌కు వెళ్లేవాళ్లకు వాళ్లు కుర్చునే ఛైర్‌, ఆ ప్లేస్‌, వాడే సిస్టమ్ అన్నీ ఒకటే ఉండాలి. రోజుకో ప్లేస్‌లో కుర్చోమన్నా, ఛైర్‌ మారినా మనకు అంత కంఫర్ట్‌గా అనిపించదు. మన ఛైర్‌ ఎక్కడున్నా మళ్లీ వెళ్లి తెచ్చుకోని మరీ కుర్చుంటాం. ఆఫీస్‌ అంటే సాధారణంగానే క్లీన్‌గా ఉంటుంది. అలా ఉంచుతారు కూడా. కానీ మెయింటేన్స్‌ సరిగ్గా లేకపోతే.. దోమల, చీమలు, దుర్వాసన రావడం సహజం.. కానీ ఆ ఆఫీస్‌లో బొద్దింకలు కూడా వచ్చాయి. ఆఫీస్‌లో బొద్దింకలకు భయపడి ఓ యువతి లక్షల విలువైన ఉద్యోగాన్ని వదిలేసింది. ఈ ఘటన దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగింది. ప్రస్తుతం ఆ యువతి సోషల్‌ వీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌ తెగ వైరల్‌గా మారింది.

ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర చైనాలోని మంగోలియా ప్రాంతానికి చెందిన షియోమిన్ అనే యువతి గత మూడేళ్లుగా గ్వాంగ్‌జౌ నగరంలో వీడియో ఎడిటర్‌గా పని చేస్తోంది. అయితే తను ఇప్పటికి వరకు బొద్దింకను చూడలేదట..అయితే ఒక రోజు తన ఆఫీసులో ఉన్నప్పుడు కింద పాకుతూ వెళ్లినప్పుడు చూసిందట. ఆ రోజు నుంచి తనకు బొద్దింక చూసినప్పుడుల్లా భయంతో పరుగులు పెట్టేదట. చివరకు ఆ యువతికి చిరకొచ్చి లక్షల విలువ గల వీడియో ఎడిటర్‌ జాబ్‌ని వదిలేసిందని వెల్లడించింది.

అంతేకాకుండా ఆఫీస్‌లో బొద్దింకలు తన వద్దకు రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలే చేసిందంట యువతి. కొన్ని సందర్బాల్లో బొద్దింకలు రాకుండా ఉండడానికి వివిధ పురుగుల మందులను కూడా వినియోగించానని ఆమె తెలిపింది. ఆఫీసులో మెయింటెనెన్స్ గురించి కూడా ఆ అమ్మాయి సోషల్‌ మీడియాలో క్లుప్తంగా వివరించింది. గదిని శుభ్రం చేయడానికి ఎవరు రారని, సీలింగ్, కిటికీల నుంచి తరచుగా బొద్దింకలు, ఈగలు, దోమలు వస్తుండేవని అమె తెలిపింది.

బొద్దింకలు, బల్లుల్ని చూసి మహిళలు తరచుగా భయపడుతూ ఉంటారు. అవి ఇంట్లో వచ్చినా నానా ఆగం చేస్తారు. ఆ భయం చాలా డేంజర్‌.. అలాంటిది ఆఫీస్‌లో ఆ బొద్దింకలు ఉండటం, అవి ఇప్పుడు మీద పడతాయో అన్న టెన్షన్‌తో ప్రశాంతంగా పని చేయలేక.. ఉద్యోగాన్ని వదిలేసుకుంది. మొదట విన్నప్పుడు ఆశ్చర్యపోయినా.. ఆమె ప్లేస్‌లో ఉండి ఆలోచిస్తే కరక్టే అనిపిస్తుందేమో కదా..!

Read more RELATED
Recommended to you

Latest news