ఆఫ్రికా ఖండం ప్రపంచ పటంలో తన నిజమైన పరిమాణాన్ని సరిగ్గా చూపించాలని కోరుతుంది. ప్రస్తుత మెర్కేటర్ ప్రొజెక్షన్ మ్యాప్ ఆఫ్రికాను చిన్నగా వక్రీకరించి చూపిస్తుంది. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఆఫ్రికన్ యూనియన్ ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్‌ను సమర్థిస్తోంది.ఈ డిమాండ్ గురించి అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
ప్రపంచ పటంలో ఆఫ్రికా ఖండం యొక్క నిజమైన విస్తీర్ణం సరిగా చూపడం లేదని ఆఫ్రికన్ యూనియన్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. 16వ శతాబ్దంలో రూపొందించిన మెర్క్టేటర్ ప్రొజెక్షన్ మ్యాప్ ఆఫ్రికాను గ్రీన్ ల్యాండ్ కంటే చిన్నగా చూపిస్తుంది. అయితే వాస్తవానికి ఆఫ్రికా 14 రెట్లు పెద్దది. ఈ వర్గీకరణ ఆఫ్రికా యొక్క భౌగోళిక, ఆర్థిక ప్రాముఖ్యతను తగ్గిస్తుందని వారు వాదిస్తున్నారు.

ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ అనేది కొత్త మ్యాప్ రూపకల్పన ఇది ఖండాల నిజమైన పరిమాణాలను కచ్చితంగా చూపిస్తుంది. ఈ మ్యాప్ లో ఆఫ్రికా తన వాస్తవ విస్తీర్ణాన్ని 30.3 మిలియన్ల చదరపు కిలోమీటర్లు సరిగ్గా ప్రతిబంబిస్తుంది. ఇది ధ్రువ ప్రాంతాల వద్ద వర్గీకరణ తగ్గిస్తుంది, ఆఫ్రికా యొక్క నిజమైన భౌగోళిక శక్తిని హైలెట్ చేస్తోంది.
మెర్కేటర్ ప్రొజెక్షన్ మ్యాప్ యూరోపియన్ ఆధిపత్య దృక్పథాన్ని ప్రతిపాదిస్తుందని ఆఫ్రికాను తక్కువ చేసి చూపిస్తుందని ఆఫ్రికన్ యూనియన్ వాదిస్తుంది. ఈ వక్రీకరణ విద్యా,వాణిజ్యం సాంస్కృతిక అవగాహనలపై ప్రభావం చూపుతుందని, ఈక్వల్ ఎర్త్ మ్యాప్ ఆఫ్రికాకు న్యాయం ప్రపంచ దృష్టి కోణాన్ని సమతుల్యం చేస్తుందని వారు భావిస్తున్నారు.
అఫికా యొక్క కొత్త డిమాండ్ ప్రపంచ పటాన్ని సరళీకరించడమే కాక ఖండాల నిజమైన పరిమాణాలను గౌరవించేలా చేస్తుంది. ఈ మార్పు ఆఫ్రికా యొక్క గొప్పతనాన్ని సరిగా గుర్తించడానికి ఒక ముఖ్యమైన అడుగ్గా భావిస్తున్నారు.