నా బిడ్డను చంపిన వాడికి భూమి మీద బతికే హక్కు లేదన్నారు సహస్ర తండ్రి. అలాంటి క్రిమినల్స్ ను వదిలేస్తే నా లాంటి తండ్రులను ఎంతో మందిని ఏడిపిస్తాడని మండిపడ్డారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని…. చట్టం, పోలీసులు, ప్రభుత్వం వాడిని మైనర్ అని, బాలుడు అని పరిగణించొద్దని పేర్కొన్నారు.

నా బిడ్డని చంపిన తర్వాత మా మధ్యే ఉంటూ నా కొడుకుని ఏడవకు ఏడవకు అంటూ ఓదార్చాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిందితుడి తల్లిదండ్రులను కూడా శిక్షించాలి, హత్యలో వాళ్ల ప్రమేయం కూడా ఉందన్నారు సహస్ర తండ్రి.