దోమలతో బర్గర్లు చేసుకుని తింటున్న ఆఫ్రికన్లు.. కానీ పరిశోధకులు ఏమంటున్నారంటే..

ఆఫ్రికా అంటేనే.. పేదరికం కళ్లముందు కదలాడుతుంది. ఈ దరిద్రం నుంచి ఆ దేశ ప్రజలు బయటపడలేకపోతున్నారు. తిండానికి సరైన ఆహారం ఉండదు. కానీ కడుపు ఆకలికి ఆగదు కదా..! ఏదో ఒకటి టైంకు పెట్టాలి. అక్కడి ప్రజలు కొందరు…దోమలతో బర్గర్ చేసుకుని తింటున్నారు. ఛీ దోమలతోనా అనుకోకండి..కాయిన్ కు రెండో సైడ్ ఆలోచిస్తే.. వాళ్లు ఏంత దయనీయమైన స్థితిలో ఉంటే.. ఇలా తింటున్నారో చూడండి.!
ఆఫ్రికాలో దోమలు లేని ప్లేస్ లేదు. అది కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. గుంపులు గుంపులుగా తిరుగుతాయి. వేసవి వస్తే చాలు… ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. మన దగ్గర వాన వస్తే.. ఉసుల్లు ఎలా మీద పడేట్లు ఉంటాయో.. అక్కడ దోమలు అలా విపరీతంగా ఉంటాయి. వాటిని దాకలతో పట్టుకుంటారు. దాక తగలగానే దోమలకు కళ్లు తిరిగి అందులో పడిపోతాయి
అలా ఈ గిన్నెల్లో పడే వాటిని..చేతులతో బాగా దగ్గరకు నొక్కుతారు. పదే పదే నొక్కడం ద్వారా ఆ దోమలు ముద్దలా అవుతాయి. ఆ ముద్దను నూనెలో బాగా వేపుకొని ఆఫ్రికన్లు తింటారు. అదే వారికి చికెన్ బర్గర్ లా భావిస్తారు. మీరు మళ్లీ.. అందులో ఏం వేసుకోరా, సైడ్ డిష్ ఉండదా అని ఆలోచించకండి.. అవి అన్నీ లేకనే.. వాళ్లు ఇలా కడుపు నింపుకుంటున్నారు. ఈ బర్గర్లు కరకరలాడతాయట. వీటిని వండేటప్పుడు ఎలాంటి మసాలాలా లేకపోయినా..రుచికరంగా ఉంటాయట.
తింటే ప్రయోజనమే..!
ఈ మస్కిటో బర్గర్లను తినడం వల్ల ఆఫ్రికన్లు ప్రోటీన్స్ పొందుతున్నారట. ఆ దోమల్లో పోషక విలువలు కూడా ఎక్కువేనని పరిశోధనల్లో తేలింది. ఒక్కో మస్కిటో బర్గర్ తయారీకి 5 లక్షల దాకా దోమలు అవసరం అవుతున్నాయట. ఈ దోమల్లో బీఫ్‌లో కంటే 7 రెట్లు ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. పోనీలే.. కనీసం వాళ్లకు ఈ రకంగా అయినా మేలు జరుగుతుంది. ప్రభుత్వాలు వాళ్లకు ఎలాగూ సాయం చేయలేకపోతున్నాయి.. కనీసం ప్రకృతి అయినా వాళ్లను ఇలా కాపాడుతుంది అని ఈ విషయం తెలిసిన నెటిజన్లు అంటున్నారు.. మీరేమంటారు..?
-Triveni Buskarowthu