ఓటేస్తావా.. బలుపుతో రాసిన పాట కాదు.. బాధతో, బాధ్యతతో రాసిన పాట: వీడియో

-

ఓటేస్తావా.. ఓటేస్తావా… ఓటేస్తావా… ఓటేస్తావా… ఒళ్లు కొవ్వెక్కి ఓటేస్తావా?
ఓటేస్తావా… కళ్లు నెత్తికెక్కి ఓటేస్తావా?
చిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా? అంటూ ప్రముఖ సినీ రచయిత అనంత్ శ్రీరామ్ ఓటుపై చైతన్యవంతమైన పాట పాడారు. ఆయనే లిరిక్స్ రాసి.. ఆయనే పాడారు. డబ్బులకు అమ్ముడుపోయి ఓటేసి ఏం సాధిస్తావు. సిగ్గు లేకుండా డబ్బులు తీసుకొని ఓటేస్తే నీకు వచ్చేదేం ఉండదు. నిన్ను పట్టించుకునేవాడు ఉండడు. నీకు సమాజంలో విలువ ఉండదు.

రాబోయేది ఎన్నికల కాలం కాబట్టి.. దేశమంతా త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కనీసం ఇప్పుడైనా నోటు తీసుకోకుండా ఓటేయండంటూ ఆయన ఈ పాట పాడి దాన్ని తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version