మీ పెట్ కి రక్తం కావాలా? యానిమల్ బ్లడ్ లైన్ ను సంప్రదిస్తే చాలు..!

-

యానిమల్ బ్లడ్ లైన్.. అనేది ఓ స్వచ్ఛంద సంస్థ. అక్కడ పెట్ డోనర్స్, వాటి బ్లడ్ గ్రూప్స్ కు సంబంధించిన డేటా ఉంటుంది. దేశం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో ఉన్న పెట్ డోనర్స్ డేటా వాళ్ల వద్ద ఉంటుంది.

ఈరోజుల్లో రక్తం అనేది చాలా అవసరం. అది మనుషులకే కాదు.. జంతువులకు కూడా అవసరమే. అయితే.. మనుషుల కోసం ఎన్నో బ్లడ్ బ్యాంకులను మనం చూస్తుంటాం. మరి.. మనం ముద్దుముద్దుగా పెంచుకునే మన పెట్స్ కు ఎప్పుడైనా రక్తం అవసరమైతే ఎలా? ఎలా? ఎప్పుడైనా ఆలోచించారా? వాటికి రక్తం ఇచ్చే దాత ఎవరు ఉంటారు? వాళ్ల గురించి ఎలా తెలుసుకోవాలి. పెట్స్ కు కూడా రక్తం దానం చేసే పెట్స్ ఉంటాయా? అర్జెంట్ గా పెట్స్ కు రక్తం అవసరమైతే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే యానిమల్ బ్లడ్ లైన్.

యానిమల్ బ్లడ్ లైన్.. అనేది ఓ స్వచ్ఛంద సంస్థ. అక్కడ పెట్ డోనర్స్, వాటి బ్లడ్ గ్రూప్స్ కు సంబంధించిన డేటా ఉంటుంది. దేశం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో ఉన్న పెట్ డోనర్స్ డేటా వాళ్ల వద్ద ఉంటుంది. ఆ డేటాతో పెట్ కు అత్యవసర సమయాల్లో బ్లడ్ కావాల్సి వస్తే.. వాళ్లకు సమీపంలోని డోనర్ ను కాంటాక్ట్ అవొచ్చు.

సాధారణంగా పెట్ లకు ఏదైనా యాక్సిడెంట్ అయినా.. సర్జరీ చేసినా.. ఏవైనా వ్యాధులు సోకినా వాటికి బయటి నుంచి రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. అయితే.. దేశం మొత్తం మీద యానిమల్ బ్లడ్ బ్యాంకులు ఉన్నది ఒకటి రెండు మాత్రమే. సో.. అత్యవసర సమయాల్లో వాటికి బ్లడ్ కావాలంటే కష్టంగా మారుతోంది.

అందుకే… సీహెచ్ శివ కుమార్ వర్మ అనే వ్యక్తి యానిమల్ బ్లడ్ లైన్ అనే సంస్థను స్థాపించారు. దేశం మొత్తం మీద పెట్ డోనర్స్ డేటాను సేకరించి ఆన్ లైన్ లో అందరికీ అందుబాటులో ఉండేలా చేశారు. ఆ డేటాను ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరైనా తమ పెట్ కు అత్యవసర సమయాల్లో ఆ డేటా ద్వారా డోనర్స్ తో మాట్లాడి రక్తం పొందొచ్చు. ప్రస్తుతానికి యానిమల్ బ్లడ్ లైన్ సంస్థ 135 పట్టణాల్లో తన సేవలను విస్తరించింది. ఇంకా మిగితా పట్టణాల్లో కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం అయిన జూన్ 14 శుక్రవారం పెట్ డోనర్స్ డేటాను స్టోర్ చేసిన వెబ్ సైట్ www.animalbloodline.org ని లాంచ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలకు సంస్థ ఫౌండర్ శివ కుమార్ ను 9490939424 నెంబర్ కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version