హ్యాపీ బర్త్‌డే భార్గవ్‌.. ఎన్టీఆర్‌ చిన్నకొడుకు పుట్టిన రోజు ఫోటోలు

-

జూనియర్ ఎన్టీఆర్ అప్పుడే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఆ పిల్లలు కూడా పెరిగి పెద్దవుతున్నాయి. అప్పుడే ఆయన చిన్న కొడుకు భార్గవ్ రామ్ పుట్టి నేటికి ఏడాది అయిందట. భార్గవ్ రామ్ పుట్టి ఏడాది అయిన సందర్భంగా తన కొడుకుతో ఉన్న పోటోను జూనియర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు.

తన పెద్ద కొడుకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. తన పెద్ద కొడుకు అభయ్ రామ్ 2014 జులై 22 లో జన్మించాడు. ఆ తర్వాత గత సంవత్సరం వీళ్లకు భార్గవ్ జన్మించాడు. ఇక.. ఇద్దరు కొడుకులతో ఆడుకుంటూ జూనియర్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక.. ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం త్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. మల్టీస్టారర్ మూవీ ఇది. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీంగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version