ఇయర్ ఫోన్స్ వలన ఇన్ని నష్టాలా..? జాగ్రత్తగా ఉండండి మరి..!

-

చాలామంది ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇయర్ ఫోన్స్ ని పెట్టుకుని పాటలు పాడడం కాల్స్ మాట్లాడటం వంటివి చేస్తూ ఉంటారు నిజానికి ఇయర్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించడం వలన నష్టాలు కలుగుతాయి మీరు కూడా ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా వాడుతున్నారా..? అయితే కచ్చితంగా దాని వలన కలిగే నష్టాలు చూడాల్సిందే. ఇయర్ ఫోన్స్ ని ఉపయోగించడం వలన వినికిడి సామర్థ్యం బాగా తగ్గుతుంది. వినికిడి సామర్థ్యం 90 డెసిబిల్స్ ఉంటుంది ఇయర్ ఫోన్స్ ని ఉపయోగిస్తే అది 40 50 డెసిబుల్స్ కి తగ్గిపోతుంది ఈ కారణంగా దూర శబ్దాలు మీకు వినపడవు.

అలానే ఇయర్ ఫోన్స్ ని ఉపయోగించడం వలన చెవులకి మాత్రమే సమస్యలు వస్తాయని అనుకుంటారు కానీ హృదయ సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇయర్ ఫోన్స్ ని వాడడం వలన దీర్ఘకాలికంగా గుండెకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇయర్ ఫోన్స్ కి వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది.

తలనొప్పి కూడా ఇయర్ ఫోన్స్ వలన కలగవచ్చు. మైగ్రేన్ కూడా ఇయర్ ఫోన్స్ కారణంగా వచ్చే అవకాశం ఉంది. ఇయర్ ఫోన్స్ ని ఉపయోగిస్తే నిద్రలేమి సమస్య కూడా రావచ్చు. అలానే స్లీప్ ఆప్నియా వంటి ఇబ్బందులు కూడా రావచ్చు.

ఇయర్ ఫోన్స్ ని వాడడం వలన చెవి ఇన్ఫెక్షన్స్ కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇయర్ ఫోన్స్ కి దూరంగా ఉండండి. ఇయర్ ఫోన్స్ ని ఉపయోగిస్తే చూపు మసకబారుతుంది అలానే ఇది నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇయర్ ఫోన్స్ ని వాడకుండా ఉండడం మంచిది. ఇయర్ ఫోన్స్ ని గంటల తరబడి వాడడం వలన మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా ఉపయోగించకండి జ్ఞాపకశక్తిపై కూడా ఇదే ప్రభావం చూపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version