శాకాహారులే అందంగా ఉంటారా ? ఈ ఫొటోలు చూసి చెప్పేయవచ్చు..!

-

ప్రపంచంలో శాకాహారులు, మాంసాహారులు.. రెండు వర్గాలకు చెందిన వారు ఉంటారు. నిత్యం వారు తమ దినచర్యలో భాగంగా తమకు నచ్చిన ఆహారాలను తింటారు. అయితే ఫలానా ఆహారం తినమని, ఫలానాది తినవద్దని మనం ఎవరినీ బలవంతపెట్టలేం. ఎవరైనా సరే తమ అలవాట్లు, ఇష్టాలకు అనుగుణంగా ఆహారం తింటారు. కానీ మాంసాహారం తినడం కన్నా శాకాహారం మేలైందని కొందరు నిపుణులు అంటారు. అది ఎందుకో కింద ఇచ్చిన చిత్రాలను ఒక్కసారి చూడండి.

మొదటి ఫొటోలో ఉన్నది జెస్సికా చాస్టెయిన్‌. అమెరికన్‌ నటి. ది మార్షియన్‌, ఇంటర్‌స్టెల్లార్‌ వంటి చిత్రాల్లో నటించింది. రెండో ఫొటోలో ఉన్నది అన్నె హాతవే. ఈమె కూడా నటి. పలు హిట్‌ చిత్రాల్లో నటించింది. ఇక మూడో ఫొటోలో ఉన్నది నికోల్‌ ఆనిస్టన్‌. ఈమె శృంగార తార. అడల్ట్‌ ఇండస్ట్రీలో అనేక మూవీలు చేసింది. అయితే ఈ ముగ్గురికీ సంబంధించి కామన్‌ పాయింట్‌ ఒకటుంది. అదేమిటంటే.. వీరు ముగ్గురూ శాకాహారులే. అవును. శాకాహారం తింటున్నందునే ఇంత అందంగా ఉన్నారని అభిమానులు వారిని ప్రశంసిస్తుంటారు.

అయితే అందరినీ మాంసాహారం మానేసి కేవలం శాకాహారమే తినమంటారా ? అని ఎవరైనా అడగవచ్చు. కానీ ముందే చెప్పాం కదా. ఎవరిష్టం వారిది. ఎవరినీ బలవంతపెట్టేది లేదు. ఎవరికి నచ్చిన ఆహారం వారు తింటారు. కాకపోతే శాకాహారం తినడం వల్ల కలిగే లాభం గురించి పైన చెప్పడం జరిగింది. అంతే.. మాంసాహారం మానేసినా, కేవలం శాకాహారమే తిందామనుకున్నా.. అది మీ ఇష్టం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version